Sunday, April 6, 2025
HomeతెలంగాణThagallapalli: జిల్లా అధ్యక్షుడిని సన్మానించిన తంగళ్ళపల్లి బీజేపీ నేతలు

Thagallapalli: జిల్లా అధ్యక్షుడిని సన్మానించిన తంగళ్ళపల్లి బీజేపీ నేతలు

బీజేపీ అధ్యక్షుడిగా మూడోసారి

రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా మూడోసారి నియామకమైన ప్రతాప రామకృష్ణను తంగళ్ళపల్లి బిజెపి మండల నాయకులు వేములవాడలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయనకు పూల బొకే అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు శ్రీదర్ రావు, బీజేవైఎం మండల అధ్యక్షుడు కోల ఆంజనేయులు, బీజేపి నేతలు సురువు వెంకట్, మంచికట్ల ప్రసాద్, కాళీ చరణ్, కన్నె అరుణ్ కుమార్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News