Thursday, December 26, 2024
HomeతెలంగాణThalakondapalli: స్థానిక సమరానికి అందరూ సన్నద్ధం కండి

Thalakondapalli: స్థానిక సమరానికి అందరూ సన్నద్ధం కండి

పంచాయితీ పోరు

స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ ఇతర పార్టీల నేతలు సన్నద్ధం అవుతున్నాయి. అధికార యంత్రాంగం ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై దృష్టి పెట్టిన నేపథ్యంలో గ్రామాల్లో సందడి మొదలైంది. తలకొండపల్లి మండలంలోని 32 గ్రామ పంచాయతీలలో యువకులు సైతం స్థానిక ఎన్నికలపై అత్యంత ఆసక్తి చూపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలే ప్రధానంగా అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్‌ పథకాల అమలు తీరును ప్రజలకు వివరిస్తూ పట్టు నిలుపుకోవాలని భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్‌ఎస్‌, బీజేపీ వ్యూహాత్మకంగా గ్రామాల్లో ప్రచారానికి సిద్ధమవుతున్నాయి.

- Advertisement -

గ్రామ స్థాయిలోకి పార్టీల ప్రతినిధులు

సంక్రాంతికి కొత్త సర్పంచులు వస్తారని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలతో తలకొండపల్లి మండలంలోని 32 గ్రామ పంచాయతిలతో పాటు గిరిజన తాండ గ్రామ పంచాయతీలలో వివిధ పార్టీల ప్రతినిధులు వివిధ శుభ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. గ్రామస్థాయిలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ముందుంటున్నారు. స్థానిక ఎన్నికల ఆశావహులు గ్రామాల్లో తిరుగుతూ అందరినీ పలకరిస్తున్నారు. చిన్న చిన్న శుభకార్యాలకు సైతం హాజరవుతున్నారు. ఎవరికి వారే తమ ప్రాబల్యాన్ని పెంచుకునే దిశగా సిద్ధం అవుతున్నారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడెప్పుడు అంటూ తలకొండపల్లి మండలంలోని నాయకులు అత్యుత్సాహంతో మెలుగుతున్నారు. నోటిఫికేషన్‌ రావడమే తరువాయిగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గ్రామ పంచాయతీ సర్పంచుల పదవీకాలం ముగిసి పది నెలలవుతోంది. సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన గ్రామాలలో కొనసాగుతోంది. అదే క్రమంలో మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ సభ్యుల పదవీ కాలం జూలైలో ముగిసి దాదాపు ఐదు నెలలవుతోంది. పూర్తిగా స్థానిక సంస్థల ఎన్నికలే వరుసగా ఉండడంతో ఎన్నికల వాతావరణం గ్రామాలలో పండుగ వాతావరణంలా కనిపిస్తోంది.

ప్రభుత్వ పథకాలే ప్రధానం

కాంగ్రెస్‌ పార్టీ నేతలు తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక ఎన్నికల్లో పట్టు సాధించే దిశగా సిద్ధమవుతోంది. మరోవైపు కాంగ్రెస్‌లోని నేతలు పోటీకి ఎవరికి వారే సిద్ధం అవుతున్నారు. పదేళ్ల తరువాత కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ద్వారా ఆశావహులు ఎక్కువ మొత్తంతో పదవులను అందిపుచ్చుకోవాలనే తాపత్రయంతో ఉన్నారు. రిజర్వేషన్లు అనుకూలిస్తే సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. తలకొండపల్లి మండలంలోని 32 గ్రామ పంచాయతీలలో మెజార్టీ సీట్లు సాధించాలనే లక్ష్యంగా ఉన్నారు.

వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్‌ఎస్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడాదవుతున్నా తలకొండపల్లి మండలంలో ఎలాంటి అభివృద్ధి లేదనీ, ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యం చెందారని బీఆర్‌ఎస్‌ నేతలు ప్రచారం మొదలు పెట్టారు. వీలైన సందర్భాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. రైతుల మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ అనీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్లు ఎలా ఉన్నాయి మళ్లీ అవకాశంపై తమ కుటుంబ సభ్యులనే బరిలో నిలిపే విధంగా సిద్ధం అవుతున్నారు.

స్థానిక ఎన్నికలపై బీజేపీ దృష్టి

తలకొండపల్లి బీజేపీ నేతలు స్థానిక ఎన్నికలపై దృష్టి సారించారు. గతంలో ఇతరేతర పార్టీలకు బిజెపి సపోర్ట్‌గా నిలవడంతో ఈ సారి మండలంలో ప్రత్యేకంగా ఏకపక్షంగా మెజార్టీగా గెలుపొందాలని బిజెపి నాయకులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందించే సంక్షేమ పథకాలే తమకు పదవులు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News