Sunday, July 7, 2024
HomeతెలంగాణThalakondapalli: రేవంత్ ఇమేజ్ దెబ్బతీసే కుట్ర?

Thalakondapalli: రేవంత్ ఇమేజ్ దెబ్బతీసే కుట్ర?

ఎందుకీ పరాభవం?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలనుకున్నా ఫలితం తేడా కొట్టేసింది. ఆ స్థానాన్ని బీఆర్ఎస్ ఖాతాలో వేసుకుంది. పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ ఎదురీదుతున్న సమయంలో ఈ విజయం ఆ పార్టీకి బూస్టింగ్ ఇవ్వడమే కాదు కాంగ్రెస్ కు గట్టి షాక్ కూడా ఇచ్చినట్లు అయింది.

- Advertisement -

ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ లో మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం బీజేపీ కైవసం చేసుకుంటుందనే ప్రచారంతో కాంగ్రెస్ లో కొంత నైరాశ్యం కనిపిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి గెలుపు కోసం రేవంత్ రెడ్డి పలుమార్లు మహబూబ్ నగర్ సెగ్మెంట్లో పర్యటించారు. తన సొంత జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే తన గౌరవం మరింత పెరుగుతుందని ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. కానీ, వంశీ ఓటమి అంచులో ఉన్నారనే ప్రచారం… తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాభవం కాంగ్రెస్ నే కాదు.. రేవంత్ ను కూడా కొంత అప్రతిష్టపాలు చేసేదే.

మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకొని రేవంత్ పని చేసినా ఎందుకీ పరాభవం అనే చర్చ జరుగుతోంది. రేవంత్ ను అప్రతిష్టపాలు చేసేందుకు తెర వెనక ఏమైనా శక్తులు పని చేశాయా..? ఎమ్మెల్సి ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బీజేపీ మద్దతుగా నిలవడం ఫలితంగా, ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందా..? అనే అనుమానాలు తాజాగా వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి ఈ వరుస పరిణామాలు మాత్రం కాంగ్రెస్ లో కొత్త చర్చకు తెరలేపాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News