ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత తలకొండపల్లి మాజీ జెడ్పిటిసి ఉప్పల వేంకటేశ్-మంజులల చిన్న కుమారుడు అనిల్-బావనల వివాహా విందు తలకొండపల్లి ఎక్స్ రోడ్డు వద్ద ఆదివారం ఘనంగా నిర్వహించారు. గత నెల పెళ్లి చేసుకున్న ఈ నూతన జంటను ఆశీర్వదించడానికి వివిధ పార్టీల రాజకీయ నాయకులు, పారిశ్రామిక ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 25 వేలకు పైగా జనసమూహం వచ్చింది. పెద్ద ఎత్తున నాయకులతో పాటు ప్రజల నుండి నూతన జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సాధారణంగా పెళ్లి అంటే భారీ కల్యాణ మండపం, విందు భోజనాలు, ఊరేగింపులు ఉంటాయి. ఈ వేడుకలు మాత్రం కల్వకుర్తి నియోజకవర్గం వ్యాప్తంగా గ్రామ గ్రామాన ఎన్నికల వాతావరణాన్ని సృష్టించిందని ప్రజలు మాట్లాడుకోవడం వినిపించింది.
ఈ విందులో మాజీ జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్-మంజులల దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు కూడా నిర్వహించారు. విందుకు హాజరైన ప్రజలందరికీ అన్ని రకాల వంటకాలతో విందు భోజనాలు ఎర్పాటు చేసారు. ప్రజలందరూ విందులో ఎర్పాటు చేసిన కళా బృందం తిలకించి, పులకించారు. తలకొండపల్లి ముఖ్య కూడలి వద్ద భారీ సంఖ్యలో జనసమూహం ఏర్పడడంతో ఎక్స్ రోడ్డు వద్ద నలుదిక్కులా ట్రాఫిక్ రద్దీ పెరిగింది.
కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు నిరంతరం అందించే సేవలకు గుర్తింపుగా విందుకు హాజరైన జనసమూహం చూసి ఆయన ఆనందం వ్యక్తం చేశారు. విందుకు హాజరైన ముఖ్య అతిథులలో మాజీ ఎంపి పోతుగంటి రాములు, మాజీ ఎమ్మెల్యేలు గుర్క జైపాల్ యాదవ్, గువ్వల బాలురాజు, ప్రముఖ జానపద కళాకారిణి రెలారే గంగమ్మ, భారాసా నాయకులు సిఎల్ శ్రీనివాస్ యాదవ్, మాజీ జెడ్పిటిసిలు ద్యాప విజితా రెడ్డి, జర్పుల దశరథ్ నాయక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, జగతయ్య, గోపాల్ నాయక్, జ్యోతయ్య, శేఖర్ ఆషేష జనసమూహంతో ప్రముఖులు రాజకీయ నాయకులు తదితరులు ఉన్నారు.