Saturday, November 23, 2024
HomeతెలంగాణThalasani: అభివృద్ధిపై చర్చకు సిద్ధమా ?

Thalasani: అభివృద్ధిపై చర్చకు సిద్ధమా ?

BJP, కాంగ్రెస్ పార్టీ నేతలకు మంత్రి తలసాని శ్రీనివాస్ సవాల్ విసిరారు. అంబర్ పేట నియోజకవర్గ పరిధిలోని గోల్నాక డివిజన్ BRS ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మంత్రి తలసాని, అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదని ప్రధాని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అంబర్ పేట MLA గా 15 సంవత్సరాలు, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి 4 సంవత్సరాలలో అంబర్ పేటకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

దేశంలో KCR ను డీ కొట్టగల నాయకుడు లేరని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు మాని, ఢిల్లీ నుండి నిధులు తెచ్చే దమ్ము BJP నాయకులకు ఉందా? అన్ని మతాలను తెలంగాణ ప్రభుత్వం గౌరవిస్తూ అన్ని పండుగలను ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారన్నారు. BJP మతాలు, కులాల పేరుతో రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నాయని, అంబర్ పేట లో MLA గా ఓడినందునే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయ్యారని, BRS కి కృతజ్ఞతలు చెప్పాలన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News