మత్స్య శాఖ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్, GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తోపాటు 112వ డివిజన్ కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు 22/06/2023 నాడు ముగియనుండగా, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని తెలియజేశారు.
22వ తేదీన సాయంత్రం సీఎం కేసీఆర్ చే అమరవీరుల స్మారక కేంద్రం ప్రారంభోత్సవం, అనంతరం బహిరంగ సభ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. దీనికి ముందు డా. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవరణ నుండి అమర వీరుల స్మారక కేంద్రం వరకు 5000 మంది కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలతో కూడిన ర్యాలీ గంటన్నర సేపు జరుగుతుందని తెలిపారు.
కాబట్టి 4:30గం.ల వరకు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు, కార్యకర్తలతో కలిసి కార్యస్థలానికి పెద్ద సంఖ్యలో హాజరుకావాలని సూచించారు. అమరవీరుల స్తూపం వద్ద సమయానికి అందరూ హాజరయ్యేలా చూడాలన్నారు.