నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, ప్రజల అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తాను ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. అమీర్‌పేట డివిజన్ పార్క్ అవెన్యూ కాలనీలో రూ.3.5 లక్షల వ్యయంతో అభివృద్ధి చేసిన 2 పార్క్ లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో రోడ్లు, డ్రైనేజీ, వాటర్ పైప్ లైన్ ల ఏర్పాటు, పార్క్ ల అభివృద్ధి వంటి పనులు చేపట్టి ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించినట్లు చెప్పారు. పార్క్ అవెన్యూ కాలనీలో గతంలో పర్యటించిన సందర్భంలో పార్క్ లోని సమస్యలను కాలనీ ప్రజలు మంత్రి దృష్టికి తీసుకురాగా అభివృద్ధి పనులు చేపడతామని ఇచ్చిన హామీ మేరకు పనులు పూర్తి చేసి నేడు ప్రారంభించారు. పార్క్ వెంట ఉన్న నాలా గోడకు పెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరగా, వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, డిసి మోహన్ రెడ్డి, ఈఇ ఇందిర, హార్టికల్చర్ డిడి శ్రీనివాస్, వాటర్ వర్క్స్ జిఎం హరి శంకర్, కాలనీ సభ్యులు అజయ్ కుమార్ అగర్వాల్, సురేందర్ పురోహిత్, శివాజీ, అనిల్ కొఠారి, సునీల్, మహేందర్, అమీర్‌పేట డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు హన్మంతరావు, అశోక్ యాదవ్, గులాబ్ సింగ్, సంతోష్ మణి కుమార్, కూతురు నర్సింహ, రాజు తదితరులు పాల్గొన్నారు.