తాను ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల్లోకి వచ్చే నాయకుడిని కాదని.. నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కరించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నానని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. సనత్ నగర్ లోని అల్లాఉద్దిన్ కోఠిలో ఆయన పర్యటించారు. అనంతరం బస్తీ అభివృద్ధి నూతన కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ౩౦, 40 సంవత్సరాల నుండి జరగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిందని వివరించారు. సనత్ నగర్ నుంచి ఎన్నికై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నియోజకవర్గాన్ని ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదన్నారు.
నియోజకవర్గ ప్రజలు ఎంతో నమ్మకంతో మర్రి శశిధర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్దిని పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. గెలిపించిన ప్రజలకు కనీసం అందుబాటులో కూడా ఉండేవారు కాదన్నారు. తాను మర్రి టైపు కానని తలసాని చెప్పారు.