Friday, November 22, 2024
HomeతెలంగాణThalasani: సమస్య ఏదైనా పరిష్కరించే బాధ్యత నాదే

Thalasani: సమస్య ఏదైనా పరిష్కరించే బాధ్యత నాదే

ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానన్న మంత్రి

సమస్య ఏదైనా పరిష్కరించే బాద్యత నాది అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. రాంగోపాల్ పేట డివిజన్ మేకలబండ ప్రాంతంలో వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముందుగా మంత్రికి స్థానిక మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్బంగా పలువురు స్థానికులు మాట్లాడుతూ నీటి సరఫరా సమయం పెంచాలని, ప్రెజర్ ను కూడా పెంచాలని కోరగా, అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వం ప్రతి ఇంటికి 20 వేల లీటర్ల వరకు నీటిని ఉచితంగా సరఫరా చేస్తుందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. అదేవిధంగా స్థానిక కమ్యునిటీ హాల్ లో కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరగా, చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కమ్యునిటీ హాల్ పై మరో అంతస్తు నిర్మాణానికి ప్రతిపాదనలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. కమ్యునిటీ హాల్ వెనుక వీధిలో విద్యుత్ తీగలు క్రిందకు వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నాయని స్థానికులు మంత్రికి విన్నవించగా, ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశీలించిన మంత్రి అక్కడ ఒక స్థంభం ఏర్పాటు చేసి క్రిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలను తొలగించాలని ఆదేశించారు. బస్తీలోని అన్ని ప్రాంతాలలో స్ట్రీట్ లైట్ లు వెలుగుతున్నాయా లేదా పరిశీలించి అవసరమైన చోట్ల లైట్ లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో సీవరేజ్ సమస్య గురించి మంత్రికి విన్నవించగా, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. బస్తీలో పారిశుధ్య నిర్వహణ, ఫాగింగ్ సక్రమంగా జరిగే విధంగా పర్యవేక్షణ జరపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బస్తీలో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే వెంటనే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వారికి వివరించారు. సమస్యల పరిష్కారం కోసం తాను నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు.

- Advertisement -

మంత్రి వెంట మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, జోనల్ కమిషనర్ రవి కిరణ్, ఈఇ సుదర్శన్, వాటర్ వర్క్స్ సిజిఎం ప్రభు, ఎలెక్ట్రికల్ డిఈ శ్రీధర్, స్ట్రీట్ లైట్ అధికారి భరత్, శానిటేషన్ డిఇ శ్రీనివాస్,టౌన్ ప్లానింగ్ ఏసీపీ క్రిష్టోఫర్, బస్తీవాసులు జగన్, అభిషేక్, సూరి, చిట్టిబాబు, వినయ్, వరమ్మ, కౌసల్య, శ్రీదేవి తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News