Friday, September 20, 2024
HomeతెలంగాణThalasani: అన్ని ప్రధాన గుళ్లలో కేసీఆర్ పుట్టిన రోజుకు పూజలు, హోమాలు

Thalasani: అన్ని ప్రధాన గుళ్లలో కేసీఆర్ పుట్టిన రోజుకు పూజలు, హోమాలు

కోమటిరెడ్డి వెంకటరెడ్డి గంటకో మాట మాట్లాడుతున్నారని..ఆయన మాటల్లో విశ్వసనీయత లేదని..కాంగ్రెస్ తో పొత్తు అనే మాటే లేదని స్పష్టం చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాలుపై స్పందించిన తలసాని .. అంబర్ పేటలో చేసిన అభివృద్ధి పై చర్చకు మా అంబర్ పెట్ ఎమ్మెల్యే రెడీగా ఉన్నారన్నారు. కిషన్ రెడ్డి అంబర్ పేట, సికింద్రాబాద్ కు చేసిన అభివృద్ధి గురించి చెప్పాలని తలసాని డిమాండ్ చేశారు. ఇక ముఖ్యమంత్రి పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ లోని అన్ని ప్రధాన దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు జరుపనున్నట్టు వెల్లడించారు. అన్ని మతాలు, కులాల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు భారీగా చేపడుతున్నట్టు తలసాని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News