Saturday, November 23, 2024
HomeతెలంగాణThanduru: ఎరుపెక్కిన తాండూరు, ఘనంగా మే డే వేడుకలు

Thanduru: ఎరుపెక్కిన తాండూరు, ఘనంగా మే డే వేడుకలు

కార్మిక కర్షక పండుగ మే డే వేడుకలు తాండూర్ పట్టణంలోని అంబేద్కర్ కూడలి దగ్గర సిఐటియు ఆధ్వర్యంలో మే డే పతాక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్, తెలంగాణ జన సమితి కౌన్సిలర్ సోమశేఖర్ మాట్లాడుతూ… 1886లో చికాగో నగరంలో జరిగిన మహత్తరమైన పోరాటం, ఆ పోరాటంలో అనేకమంది కార్మికులు బలిదానం అయ్యారని గుర్తు చేశారు. దాని ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా 8 గంటల పని దినాన్ని సాధించడం జరిగిందని అన్నారు. ఈ రోజు దేశంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎనిమిది గంటల పని దినాన్ని పోరాడి సాధించుకున్న, త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి ఆ హక్కును హరించడం కోసం ప్రయత్నం చేస్తుందని అన్నారు. నాలుగు రకాల కోడ్ లను తీసుకొచ్చి 29 చట్టాలన్నిటికీ కుదించడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని ప్రధానంగా రాష్ట్రవ్యాప్తంగా కార్మిక వర్గంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, రైతాంగానికి ఉన్నటువంటి హక్కులని, కనీసం మద్దతు ధరలను తొలగించడం కోసం ప్రయత్నం జరిగిందని అన్నారు. దానికి వ్యతిరేకంగా చారిత్రాత్మక రైతు పోరాటం జరిగిందని గుర్తు చేశారు. ఆ మూడు వ్యవసాయ నల్ల చట్టాలను వెనక్కి కొట్టినప్పటికీ వాటిని మరో రూపంలో తీసుకువచ్చేసి కార్పొరేట్లకు వ్యవసాయాన్ని కట్టబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. అని హక్కు కావాలని ఆనాడు వామపక్షాలు యూపీఏ ప్రభుత్వంతో ఉపాధి హామీ పథకాన్ని పని గ్యారెంటీ చట్టాన్ని సాధించడం జరిగిందని అన్నారు. పెట్టుబడిదారులకు కార్పొరేట్లకు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటుకరణ చేసి కారు చౌకగా ప్రవేటు వ్యక్తులకు అనుకుంటున్నారని పేద ప్రజలపై భారాలు వేస్తూ నిత్యవసర ధరలు పెంచుతున్నారని కులం పేరుతో మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతూన కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించాలని కార్మిక చట్టాలను దాన్ని కూడా కుదించే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. ప్రజల మీద తీవ్రమైన బా రాలను కేంద్ర ప్రభుత్వం మోపుతోందని అన్నారు. ఈ స్థితిలో వారం రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూనే కార్మికులు కర్షకులను కలిపి ఐక్యంగా రేపు రాబోయే కాలంలో మహా ఉద్యమాన్ని చేయాలని కార్మిక హక్కుల కోసం ఉద్యోగ భద్రత కోసం కనీస వేతనాల కోసం మరింత పోరాటాలు ఉద్యమాలు చెయ్యాలని పిలిపించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికులు, భవనిర్మాణ కార్మికులు, హమాలి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, ఎస్సీ ,ఎస్టీ ,బీసీ, మైనార్టీ హక్కుల పోరాట సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తూరు చంద్రయ్య , సిఐటియు సిపిఎం నాయకులు శ్రీనివాస్, సుదర్శన్ ,గోపాల్, రాజు, రాములు, గ్రామపంచాయతీ కార్మికులు శాంతమ్మ, వెంకటమ్మ, వెంకట్, రాములు, జిలాని, లక్ష్మి , అంజిలప్ప కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News