Saturday, November 23, 2024
HomeతెలంగాణThangallapalli: రాస్తారోకో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

Thangallapalli: రాస్తారోకో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్

మార్చి 11 సోమవారం సిరిసిల్లలో జరిగే రాస్తారోకో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో తంగళ్ళపల్లి మండల పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కుడిక్యాల కనుకయ్య అధ్యక్షతన పవర్లూమ్ వర్కర్స్ యూనియన్, అసాముల సంఘం, వార్పిన్ వర్కర్స్ యూనియన్, వైపని వర్కర్స్ యూనియన్ ఇతర అనుబంధ రంగాల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.

- Advertisement -

అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ, తంగళ్ళపల్లి ఆసాముల సంఘం ఆధ్యక్షులు గోనె పర్శరాములు మాట్లాడుతూ గత కొంతకాలంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై ఆధారపడిన పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికులు, ఆసాములకు సరైన పని లేక అనేక ఇబ్బందులు ఎదుర్కుంటామని అవేదన వ్యక్తం చేశారు. వెంటనే అందరికీ పని కల్పించాలని ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు అందరి దృష్టికి తీసుకెళ్లిన ఇప్పటివరకు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరుగుతుందన్నారు. యజమానులు కూడా వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా పవర్లూమ్స్ బందు పెట్టి ఆసాములకు భీములు, కోములు ఇవ్వకుండా కార్మికుల ఉపాది దెబ్బ తీసి రోడ్డున పడేసి వారి సమస్యలను పరిష్కరించుకోవాలని చూస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. యజమానులు ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునే విధంగా పోరాటం చేయాలని తెలిపారు. సిరిసిల్లలో గత ప్రభుత్వం మీద ప్రస్తుత ప్రభుత్వం.. ప్రస్తుత ప్రభుత్వం మీద గత ప్రభుత్వం రాజకీయంగా ఆరోపణలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే ఒకప్పటి మాదిరిగా సిరిసిల్లలో నేతన్నల ఆకలి చావుల ఆత్మహత్యలు మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం ఉన్నందున ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత తీసుకొని వెంటనే యుద్ధ ప్రాతిపదికన పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న అందరికీ పని కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందులో భాగంగానే సిఐటియు ఆధ్వర్యంలో మార్చి – 11 సోమవారం రోజున పెద్ద ఎత్తున సిరిసిల్లలో రాస్తారోకో కార్యక్రమాన్ని చేపడతామన్నారు.

ఈ కార్యక్రమంలో తంగళ్ళపల్లి లో పనిచేస్తున్న పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికులు, ఆసాములు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునచ్చారు. అందరూ సోమవారం ఉదయం 10 గంటల వరకు సిరిసిల్ల కాలేజీ గ్రౌండ్ వద్దకు రావాలని కోరారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా నాయకులు అన్నల్దాస్ గణేష్, సామల నర్సయ్య, గోరంతల రాజమల్లు, అన్నల్దాస్ గంగాధర్, కోడం వేణు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News