Tuesday, September 17, 2024
HomeతెలంగాణThangallapalli: వారెంటీ లేని ఆరు గ్యారంటీలు

Thangallapalli: వారెంటీ లేని ఆరు గ్యారంటీలు

ఎంపీపీ పడిగెల మానస రాజు

కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలకు వారంటీ లేదని తంగళ్ళపల్లి ఎంపీపీ పడిగల మానస రాజు తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మే ప్రసక్తే లేదని హస్తం అస్తమయం ఖాయమని ఆమె వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బండి జగన్ ఆధ్వర్యంలో మండల నాయకులతో కలిసి ఎంపీపీ మానస విస్తృత ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ బొట్టు పెట్టుకుంటూ సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత మంత్రి కేటీఆర్ ను కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓట్లను అభ్యర్థించారు.

- Advertisement -

అనంతరం ఆమె మాట్లాడుతూ సిరిసిల్ల నియోజకవర్గాన్ని మంత్రి కేటీఆర్ అత్యున్నత స్థాయిలో నిలపారని, నియోజకవర్గంలో ఎన్నో గ్రామాలకు జాతీయస్థాయి అవార్డులు రావడం మంత్రి కేటీఆర్ ఘనతనే అని ఆమె తెలిపారు. ముఖ్యంగా తంగళ్ళపల్లి మండలానికి వ్యవసాయ కళాశాల, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ తెచ్చారని గుర్తుచేశారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ను మన ఊరు-మనబడి కార్యక్రమం కింద 9 కోట్లతో ఆధునికరిస్తున్నారని తెలిపారు.

సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మంత్రి కేటీఆర్ ను ప్రజలు ఆశీర్వదించాలని, అభివృద్ధే ధ్యేయంగా పాటు పడుతున్న కేటీఆర్ ను కారు గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంకారపు అనిత రవీందర్, ఉప సర్పంచ్ పెద్దూరి తిరుపతి, ఎంపీటీసీ అంతయ్య, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకట రమణారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ సద్ద రోజా సురేష్, మండల జాగృతి అధ్యక్షుడు కందుకూరి రామా గౌడ్ , బిఆర్ఎస్ సీనియర్ నాయకులు అంకారపు, రవీందర్ పడిగెల రాజు, రంగు ప్రసాద్, వార్డు సభ్యులు రెడ్డి పర్షరాములు, క్యారం జగత్, మండల మైనార్టీ అధ్యక్షుడు ఎండి హమీద్, మైనార్టీ మహిళా నాయకులు ఎండి షాహిదా బేగం, నస్రిమ్ బేగం, నాయకులు దిద్ది భాస్కర్, మనోహర్, యూత్ నాయకులు నేరెల్ల అనిల్ గౌడ్, కడారి నవీన్ రెడ్డి, ఎగుర్ల కనకరాజు, కొంగరి నరేష్, ప్రేమ్, బూర సాయి, రమణ, మామిడాల విజయ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News