KCR visit Harish Rao house shortly: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తండ్రి సత్యనారాయణ ఇవాళ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. అయితే హరీశ్‌రావు తండ్రి.. మాజీ సీఎం కేసీఆర్‌కు స్వయానా బావ. కేసీఆర్ ఏడవ సోదరి లక్ష్మికి భర్తయే తన్నీరు సత్యనారాయణ. ఈ నేపథ్యంలోనే బావతో తనకు ఉన్న సాన్నిహిత్యం, అనుబంధాన్ని స్మరించుకున్న కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. సమాచారం తెలిసిన వెంటనే హరీశ్ రావుకు ఫోన్ చేసి పరామర్శించారు. మరికాసేపట్లో ఆయన కోకపేట్‌లోని హరీశ్ రావు నివాసానికి వెళ్లి దివంగత సత్యనారాయణ గారి పార్థివ దేహానికి నివాళులర్పించనున్నారు. అనంతరం తన సోదరి లక్ష్మిని కేసీఆర్ ఓదార్చనున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సంతాపం: తన్నీరు సత్యనారాయణ మృతిపట్ల సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం తెలిపారు. సత్యనారాయణ ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థించారు. హరీశ్‌రావు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Also Read:https://teluguprabha.net/telangana-news/former-minister-harish-rao-father-satyanarayana-rao-demise/
ఇప్పటికే హరీశ్‌రావు ఇంటికి చేరుకున్న కేటీఆర్: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఇంటికి చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకున్నారు. హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ గారి పార్థివ దేహానికి నివాళులర్పించారు. తన్నీరు సత్యనారాయణ మరణించిన నేపథ్యంలో ఈ రోజు భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యక్రమాలతో పాటుగా.. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు సైతం రద్దు చేస్తున్నట్టు కేటీఆర్ ప్రకటించారు.


