Friday, September 20, 2024
HomeతెలంగాణThatha Madhu: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే సీఎం లక్ష్యం

Thatha Madhu: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే సీఎం లక్ష్యం

ఘనంగా పల్లె ప్రగతి దినోత్సవం వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలం అష్టగుర్తి గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించి అనంతరం గొల్లపూడి గ్రామంలో సిసి రోడ్ల శంకుస్థాపన నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం చేసి అనంతరం రైతు వేదిక ప్రారంభోత్సవం సభా కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పల్లె ప్రగతి దినోత్సవం వేడుకలు ఘనంగా జరిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు.గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టారు వేల కోట్లతో గ్రామాలను అభివృద్ధి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు దేశంలోని ఆదర్శంగా నిలిచాయి. సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు బి ఆర్ ఎస్ పార్టీని స్థాపించారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కక్షపూరితంగా వ్యవహరిస్తుంది తెలంగాణ అభివృద్ధి పథకాలను చూసి ఓర్వలేక విమర్శలు చేస్తుంది రాబోయే ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలి సంక్షేమ పథకాలు ఇంటింటికి అందేలా కృషి చేయాలి. ఈ సందర్భంగా రైతు వేదిక భవనంలో పాలడుగు గ్రామానికి చెందిన రైతు రుణమాఫీ పంట నష్టపరిహారం అందలేదని ఎమ్మెల్యే రాములు నాయక్, ఎమ్మెల్సీ తాతా మధు కు ఫిర్యాదు చేశాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నారని రైతుల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -


ఈ కార్యక్రమంలో ఏడిఏ బాబురావు,ఎమ్మెల్సీ తాతా మధు, రైతుబంధు జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు, గొల్లపూడి సర్పంచ్ పసుపులేటి వినోద, గొల్లపూడి ఎంపిటిసి బాణాల లక్ష్మీనరసమ్మ , వైరా ఏఎంసీ చైర్మన్ బీడీకే రత్నం, వైరా ఎంపీపీ వేల్పుల పావని, వైరా జెడ్పిటిసి నంబూరి కనకదుర్గ, దిశా కమిటీ సభ్యులు కట్టాకృష్ణార్జున రావు, బి ఆర్ఎస్ నాయకులు పసుపులేటి మోహన్ రావు, బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు, బాణాల వెంకటేశ్వరరావు, రైతుబంధు మండల కన్వీనర్ రవీందర్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ తాతా బసవయ్య , వైరా టౌన్ అధ్యక్షులు మద్దెల రవి, బి ఆర్ఎస్ నాయకులు మచ్చా బుజ్జి, డాక్టర్ కాపా మురళీకృష్ణ, మిట్టపల్లి సత్యంబాబు, పులిగుట్ట టెంపుల్ చైర్మన్ షేక్ సైదా, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు వేల్పుల మురళి, వైరా ఎంపీడీవో శ్రీదేవి, వైరా ఎండిఓ జోత్స్న, ఏవో పవన్, మోరంపూడి ప్రసాద్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News