తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ప్రపంచ సుందరి(Miss World 2025) పోటీల్లో విజేతగా మిస్ థాయ్‌లాండ్ ఓపల్ సుచాత నిలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో ఆమె జీవితం పూర్తిగా మారిపోనుంది. ఇప్పటికే రూ.8.5 కోట్ల ప్రైజ్‌మనీ, వజ్రాలు పొదిగిన కిరీటం ఆమె సొంతమయ్యాయి. వీటితో పాటు ఆమెకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు కానుంది. పేరుమోసిన బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా, మోడల్‌గా, నటిగా, సామాజిక సేవా కార్యకర్తగా అనేక అవకాశాలు ఆమె దరిచేరనున్నాయి.
ఎక్కడికెళ్లినా పటిష్ఠ భద్రత ఉంటుంది. అలాగే మిస్ వరల్డ్ సంస్థ తరఫున ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ కార్యక్రమంలో భాగంగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రపంచమంతా చుట్టి రావచ్చు. ఏడాది పొడవునా ఆమెకు లగ్జరీ లైఫ్‌తోపాటు ప్రొఫెషనల్ డిజైనర్లు, స్టైలిస్టులు, న్యూట్రిషనిస్టులు అందుబాటులో ఉంటారు. ఖరీదైన మేకప్ కిట్లు, దుస్తులు, నగలు లాంటివన్నీ ఉచితంగా లభిస్తాయి.