Wednesday, March 19, 2025
HomeతెలంగాణBudget: ఈ ఆర్థిక ఏడాది ముగిసే నాటికి అప్పుల అంచనా రూ.5,04,814 కోట్లు

Budget: ఈ ఆర్థిక ఏడాది ముగిసే నాటికి అప్పుల అంచనా రూ.5,04,814 కోట్లు

తెలంగాణ అసెంబ్లీలో 2025-26 వార్షిక బడ్జెట్ (Budget)ను సభలో ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా ఆయన సభలో ప్రసంగిస్తూ.. రూ 3,04,965 కోట్లతో తెలంగాణ వార్షిక బడ్జెట్ ను సభకు సమర్పిస్తున్నామన్నారు.

- Advertisement -

ఈ ఆర్థిక ఏడాది ముగిసే నాటికి అప్పుల అంచనా రూ.5,04,814 కోట్లు అని చెప్పారు. రాష్ట్ర సొంత పన్నుల రాబడి అంచనా రూ.1,45,419 కోట్లుగా ప్రకటించారు. బడ్జెట్‌లో ప్రతిపాదించిన రుణాలు రూ.69,639 కోట్లు ఉన్నాయన్నారు.


కేంద్ర పన్నుల్లో వాటా రూ.29,899 కోట్లు ఉందన్నారు. పన్నేతర ఆదాయం అంచనా రూ.31,618 కోట్లు కాగా కేంద్రం నుంచి గ్రాంట్ల అంచనా రూ.22,782 కోట్లు ఉన్నట్లు చెప్పారు. ఈ ఆర్థిక ఏడాది ముగిసే నాటికి అప్పుల అంచనా రూ.5,04,814 కోట్లు ఉందని చెప్పారు.

జీఎస్డీపీలో అప్పుల శాతం 28.1గా అంచనా అని తెలిపారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం అంచనా రూ.19,087 కోట్లు అని తెలిపారు. ఎక్సైజ్ శాఖ ఆదాయం అంచనా రూ.27,623 కోట్లు కాగా, అమ్మకం పన్ను ఆదాయం అంచనా రూ.37,463 కోట్లు అని చెప్పారు. వాహనాలపై పన్ను ఆదాయం అంచనా రూ.8,535 కోట్లుగా తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News