Tuesday, September 17, 2024
HomeతెలంగాణMedaram Jatara: సారలమ్మ రాకకి అన్ని ఏర్పాట్లు పూర్తి

Medaram Jatara: సారలమ్మ రాకకి అన్ని ఏర్పాట్లు పూర్తి

సర్వాంగ సుందరంగా గద్దెల ప్రాంగణం

తలుచుకుంటేనే కరుణించే తల్లులు సమ్మక్క సారలమ్మల తల్లుల దర్శనం కోసం దేశం లోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు. అమ్మవార్లు ఎప్పుడు గద్దె లకు వస్తారా అని వేచి చూస్తున్న భక్తులు ఎంతో మంది..ఈరోజు సాయంత్రం సారలమ్మ గద్దె మీదకు రానున్న నేపథ్యంలో…మేడారంకి భక్తుల తాకిడి పెరిగింది. వేకువజామున నుండే భక్తుల తాకిడితో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతున్నాయి. క్యూ లైన్ లన్ని నిండిపోయాయి. వన దేవతల రాక సందర్భంగా సర్వాంగ సుందరంగా గద్దెల ప్రాంగణాన్ని ముస్తాబు చేశారు. ప్రధాన ద్వారం వద్ద వివిధ రకాల పూలతో ఏర్పాటు చేసిన అమ్మ వారి అలంకరణ భక్తులను ఆకట్టుకుంటుంది.

- Advertisement -


గద్దెల వద్ద ఎండోమెంట్, రెవెన్యూ, పోలీస్, ఫైర్, సింగరేణి రెస్క్యూ, ట్రాన్స్ కో, పంచాయతీ రాజ్ అధికారులు గద్దెల వద్ద అమ్మవారి సేవలో తరించిపోతున్నారు. గద్దెల వద్ద భక్తులు సమర్పించే బంగారాన్ని సానిటేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు తీసివేస్తున్నారు. లక్మీపురం నుండి మేడారం బయలుదేరిన సమ్మక్క భర్త పగిడిద్దరాజు. ములుగు జిల్లా – లక్మీపురం, మొద్దులగూడెంలో గిరిజన సంప్రదాయ పద్దతిలో స్వాగతం పలుకుతున్న గిరిజనులు. భారీ బందోబస్త్ మధ్య సాగుతున్న పగిడిద్దరాజు శోభయాత్ర. మరికొద్దిసేపట్లో పస్రాకు చేరుకొనున్న పగిడిద్దరాజు శోభయాత్ర. మిస్సింగ్ క్యాంపు ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.

మేడారం మహా జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మిస్సింగ్ క్యాంపు ను జిల్లా కలెక్టర్ఇలా త్రిపాఠి పర్యవేక్షించారు. జాతర పరిసరాలలో తప్పిపోయిన వారిని వారి వారి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చేందుకు ఈ మిస్సింగ్ క్యాంపు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రతి మిస్సింగ్ క్యాంపు లో ఒక జిల్లా స్థాయి అధికారీ నిరంతరం పర్యవేక్షిస్తూ భక్తులకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. భక్తులు ఎవరైనా తప్పి పాయిన లేద ఎవరైనా తప్పి పోయినట్లు తెలిసిన తమ దగ్గర లోని మిస్సింగ్ క్యాంపులలో సమాచారం అందించాలన్నారు. జాతరలో రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో భక్తులు తమ చిన్న పిల్లలను, వృద్దులను జాగ్రత్తగా చూసుకుంటూ అమ్మవార్లను దర్శించుకొని క్షేమంగా తమ తమ ఇళ్లకు చేరాలన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News