Saturday, April 5, 2025
HomeతెలంగాణRangarajan: అర్చకులు రంగరాజన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడికి బెయిల్

Rangarajan: అర్చకులు రంగరాజన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడికి బెయిల్

చిలుకూరు బాలాజీ ఆలయం(Chilkur Balaji Temple) ప్రధాన పూజారి రంగరాజన్(Rangarajan)పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డికి రాజేంద్రనగర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.15 వేలుతో రెండు పూచ్చీకత్తులు సమర్పించాలని ఆదేశించింది.

- Advertisement -

ఫిబ్రవరి నెల 7న 20 మంది నిందితులు రంగరాజన్ ఇంటికి వెళ్లారు. రామదండు కోసం మనుషులను రిక్రూట్ చేయడంతో పాటు ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. రంగరాజన్ అందుకు వ్యతిరేకించడంతో దాడికి పాల్పడ్డారు. రంగరాజన్‌పై దాడిని తెలుగు రాష్ట్రా సీఎంలు, మంత్రులు, ప్రతిపక్ష నేతలు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు ఈనెల 8న ప్రధాన నిందితుడైన వీరరాఘవరెడ్డిని అరెస్ట్ చేశారు. అతడు నేరం ఒప్పుకోవడంతో కోర్టు రిమాండ్ విధించింది. దాదాపు రెండు నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు.

కాగా రాఘవ రెడ్డి హిందూ ధర్మాన్ని కాపాడతానని రామదండు పేరుతో ఓ గ్రూపు సిద్దం చేయాలని భావించాడు. ఇందుకోసం ఫేస్‌ బుక్, యూట్యూబ్ ఛానెళ్ళు ఏర్పాటు చేసి ప్రసంగాలు ఇచ్చేవాడు. 10 నెలల క్రితం ఓ యూట్యూబ్ ఫాలోవర్ ద్వారా జనవరి 25న రంగారాజన్‌ను కలిశాడు. తమకు సహకరించాలని కోరగా ఆయన ఒప్పుకోలేదు. దీంతో దాడి రంగరాజన్‌పై దాడి చేసి పరారయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News