Saturday, November 15, 2025
HomeతెలంగాణBorn Baby: అప్పుడే పుట్టిన పసికందు.. పడేసి వెళ్లిన కసాయిలు!

Born Baby: అప్పుడే పుట్టిన పసికందు.. పడేసి వెళ్లిన కసాయిలు!

- Advertisement -

Born Baby: తల్లిపొత్తిళ్లలో ఉండాల్సిన నవజాత శిశువుని కర్కశంగా పడేసి వెళ్లిపోయారు కసాయి తల్లిదండ్రులు. పుట్టగానే వద్దనుకున్నారో ఏమోగాని అప్పుడే పుట్టిన పసికందును ఓ అపార్ట్మెంట్ ఆవరణలో పడేసివెళ్లారు. బొడ్డుతాడుతో ఉన్న ఆ ముద్దులొలికే చిన్నారిని చూసిన స్థానికులు విలవిల్లాడారు. ఈ ఘటన కుషాయిగూడలోని కమలానగర్ లో చోటుచేసుకుంది.

ఓ అపార్ట్మెంట్ ఆవరణలో అప్పుడే పుట్టిన పసికందు ఏడుపు విన్న అపార్ట్మెంట్ వాసులు.. పసికందు ప్రాణాలతో ఉన్నట్లు గమనించి పోలీసులకు, 108కు సమాచారమందించారు. కుషాయిగూడ ఎస్ఐ సాయికుమార్ క్షణాల వ్యవధిలో ఘటనాస్థలానికి చేరుకొని పసికందును తీసుకొని 108 సహాయంతో ఆసుపత్రికి తీసుకెళ్లి తన మానవత్వాన్ని చాటుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad