Raju Safe: కామారెడ్డి జిల్లాలో రెడ్డిపేటకు చెందిన షాడ రాజు ఘటన సుఖాతమైంది. సుమారు 42 గంటల పాటు రెండు బండరాళ్లు కలిగిన గృహలో చిక్కుకొని నరకయాతన అనుభవిచాడు. చివరికి.. రెస్క్యూ ఆపరేషన్‌తో అధికారులు రాజును క్షేమంగా బయటకు తీశారు. భుజంకు గాయం కావడంతో అదే జిల్లాల్లోని ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంతకీ రాజుకు ఎందుకు అలా జరిగింది.. ఎలా ఆ రాళ్ల మధ్యలో ఇరుక్కుపోయాడో తెలుసుకుందాం.
కామారెడ్డిజిల్లా రెడ్డిపేటకు చెందిన రాజు మంగళవారం సాయంత్రం సమయంలో అతని స్నేహితుడితో కలిసి అడవిలో వేటకు వెళ్లాడు. ఘన్‌పూర్ శివారు ప్రాంతంలో కుందేలును పట్టుకొనేందుకు వెళ్లాడు. బండరాళ్లపై వెళ్తున్న క్రమంలో రాజు సెల్ ఫోన్ అందులో పడిపోయింది. రెండు పెద్ద బండరాళ్ల మధ్య గృహలాగా ఉంది. రాజు సెల్ ఫోన్ తీసుకొనేందుకు ప్రయత్నించినా రాలేదు. తన స్నేహితుడికి కాళ్లు పట్టుకోమని తలకిందులుగా రాజు లోపలికి వెళ్లాడు. ఇంకేముందు. అంతే ఇరుక్కుపోయాడు. స్నేహితుడు ఎంత ట్రై చేసినా కాళ్లు వరకే పైన ఉన్నాయి. బాడీ, తల మొత్తం గృహలో ఇరుక్కుపోయింది. భయంతో రాజు స్నేహితుడు ఊళ్లోకి వెళ్లి రాజు కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలిపారు. వారు వచ్చి ఎంత ప్రయత్నించినా గృహలో ఇరుక్కుపోయిన రాజును బయటకు తీయలేక పోయారు.
చేసేదేమీలేక.. బుధవారం మధ్యాహ్నం సమయంలో విషయాన్ని స్థానిక పోలీసులకు తెలిపారు. విషయం తెలుసుకున్న జిల్లా ఏఎస్పీ సంఘటన స్థలానికి వచ్చి పరిస్థితిని పరిశీలించారు. స్థానిక తహసీల్దార్ మాట్లాడి రెస్క్యూటీంను ఏర్పాటు చేశారు. అప్పటికే బుధవారం సాయంత్రం అయింది. రాత్రి సమయంలోనూ రాజును బయటకు తీసేందుకు ప్రయత్నాలు సాగాయి. ఎంతకీరాకపోవటంతో గురువారం ఉదయం పొక్లెయిన్‌లు, ఇతర వాహనాల సహాయంతో బండరాళ్లను పక్కకు తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బండరాళ్లు పెద్దవిగా ఉండటంతో వాటిని బ్లాస్టింగ్ సైతం చేసే ప్రయత్నంకూడా చేశారు. ఇలా దాదాపు పదహారు సార్లు బ్లాస్టింగ్ జరిపారు. చివరకు గురువారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో రాజును రెస్క్యూటీం సిబ్బంది ఎంతో శ్రమించి బయటకు తీశారు. దీంతో వారిక కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేయగా, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి రాజు కుందేలు వేటకోసమని వెళ్లి రెండు బండరాళ్ల మధ్యలో ఇరుక్కుపోయాడంటూ స్థానికులు చర్చించుకోవటం గమనార్హం.