తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. GO 16ను కొట్టేస్తూ కీలక తీర్పు వెలువరించింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ రాజ్యాంగ విరుద్ధం అని హైకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయస్థానం తీర్పుతో రెగ్యులర్ అయిన ఉద్యోగులు కలత చెందుతున్నారు.
కాగా, రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం GO 16 ద్వారా వేలాది మందిని రెగ్యులరైజ్ చేసిన విషయం తెలిసిందే. రెగ్యులరైజ్ అయిన కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఎక్కువమంది విద్య, వైద్య శాఖల్లోనే ఉన్నారు. హైకోర్టు తాజా ఆర్డర్‌తో రెగ్యులరైజ్ అయిన కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే, రెగ్యులరైజ్ అయినవారిని తిరిగి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా కొనసాగించవచ్చని కోర్టు ఆదేశాలు ఇచ్చిందని పిటిషనర్లు చెబుతున్నారు. కోర్టు ఆర్డర్ కాపీ వస్తే కానీ మరింత స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు.