బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నిజానిజాలు త్వరలో తెలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక బ్యారేజీలో రెండు పగుళ్లు వస్తే ఏదో అయినట్లు చేస్తున్నారని విమర్శించారు. కమీషన్ల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే కాళేశ్వరం డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. జస్టిస్ పీసీ ఘోష్ విచారణ పూర్తయిందని అని చెప్పి.. ఇప్పుడు నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. అసలు కాంగ్రెస్ వాళ్లే ప్రాజెక్టును కూలగొట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. మేడిగడ్డ దగ్గర బాంబో లేదా మరొకటో పెట్టుంటారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో అలాంటి పనిచేసే వాళ్లు ఉన్నారంటూ ఆరోపణలు చేశారు.
ఇక సీఎం రేవంత్‌రెడ్డి అపరిచితుడిలా ఉన్నారని విమర్శించారు. అపరిచితుడి సినిమాలోని రెమో, రాము పాత్రలు ముఖ్యమంత్రికి సరిగ్గా అబ్బుతాయని సెటైర్లు వేశారు. అప్పు పుట్టలేదని రెమో పాత్ర అంటుంటే.. రూ.లక్షా 60వేల కోట్లు రాము పాత్ర అప్పు చేసిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉన్న డిక్లరేషన్లకే దిక్కు లేదని.. ఇప్పుడు నల్లమల డిక్లరేషన్ ఎందుకు? అని ధ్వజమెత్తారు. నెల రోజులుగా సీఎం మదిలో ఉన్నవి వరల్డ్ బ్యూటీస్, కేసీఆర్‌కు నోటీసులే అన్నారు. తాము కట్టిన భవనాల ముందు ప్రపంచ అందగత్తెలు ఫొటోలు దిగుతున్నారని కేటీఆర్ వెల్లడించారు.