Congress| తెలంగాణ రాజకీయాలు వాడివేడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ పార్టీ మరోసారి విమర్శలు గుప్పించింది. బీఆర్ఎస్ పార్టీది దొరల పాలన అని.. తమది ప్రజా పాలన అని పేర్కొంది. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపితే.. తమ ప్రభుత్వం పన్నుల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించింది.
కాగా పన్నుల పెంపుపై గతంలో మాజీ సీఎం కేసీఆర్(KCR) అసెంబ్లీలో మాట్లాడిన స్పీచ్‌ను ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy) ఆయా శాఖల నుంచి పన్నుల భారం ప్రతిపాదనలను తిరస్కరించిందని చెబుతు ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని షేర్ చేసింది. ఈ వీడియోలో కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ బరాబర్ ప్రాపర్టీ ట్యాక్స్ పెంచబోతున్నామని.. ఇందులో తమ ప్రభుత్వానికి ఎలాంటి శషభిషలు లేవని తెలిపారు. అలాగే మరో వీడియోలో తెలంగాణ పునర్ నిర్మాణంలో తమ ప్రభుత్వం శాయశక్తుల కష్టపడతామంటూ రేంవత్ రెడ్డి మాట్లాడిన మాటలను అటాచ్ చేసింది. దొరల పాలన, ప్రజా పాలనకు ఇదే తేడా అంటూ స్పష్టంచేసింది.