Friday, September 20, 2024
HomeతెలంగాణThorruru: తొర్రూరు హాస్పిట‌ల్ లో 100 ప‌డ‌క‌లు

Thorruru: తొర్రూరు హాస్పిట‌ల్ లో 100 ప‌డ‌క‌లు

తొర్రూరు హాస్పిట‌ల్ ను త్వ‌ర‌లోనే 100 ప‌డ‌క‌ల‌కు అప్ గ్రేడ్ చేస్తున్నామ‌ని, జీవో కూడా రానున్న‌ద‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు వెల్ల‌డించారు. తొర్రూరు ప్ర‌భుత్వ ద‌వాఖానాలో రూ.12 ల‌క్ష‌ల‌తో నూత‌నంగా ఏర్పాటు చేసిన మ‌ర్చురీని మంత్రి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, తొర్రూరు ప‌ట్ట‌ణ అభివృద్ధి, అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్లుగా హాస్పిట‌ల్ ను 30 ప‌డ‌క‌ల నుండి 100 ప‌డ‌క‌ల‌కు అప్ గ్రేడ్ చేస్తున్న‌ట్లు తెలిపారు. జీవో కూడా త్వ‌ర‌లోనే వెలువ‌డుతుంద‌ని అన్నారు. ప్ర‌భుత్వం విద్యా, వైద్యంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టింద‌ని, అందుకు త‌గ్గ‌ట్లుగా జిల్లాకో వైద్య క‌ళాశాల‌ను ఏర్పాటు చేస్తున్న‌ద‌ని చెప్పారు. వ‌రంగ‌ల్ లోనూ ఎంజిఎం హాస్పిట‌ల్‌ను ఆధునీక‌రించామ‌ని, పిఎంఎస్ ఎస్ వై సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్ కు తోడుగా రూ.11 వంద‌ల కోట్ల‌తో మ‌రో సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్ ను త్వ‌ర‌లోనే ప్రారంభిస్తామ‌ని మంత్రి తెలిపారు. వ‌రంగ‌ల్ ను హెల్త్ హ‌బ్ గా త‌యారు చేస్తున్నామ‌ని చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News