Sunday, June 30, 2024
HomeతెలంగాణThorruru-Teluguprabha effect: తెలుగుప్రభ ఎఫెక్ట్ తో స్పందించిన ఇరిగేషన్ అధికారులు

Thorruru-Teluguprabha effect: తెలుగుప్రభ ఎఫెక్ట్ తో స్పందించిన ఇరిగేషన్ అధికారులు

రాగడి మట్టి దొంగలు

ఇటుక భట్టిల వ్యాపారులు రాజకీయ నాయకుల అండతో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వేలికట్ట గ్రామం వరంగల్ నుండి ఖమ్మం వెళ్ళే రహదారి పక్కన ఇటుక బట్టిలకు వేలికట్టే, మడూరు, చెరువుల నుండి తమకు ఇష్టం వచ్చిన విధంగా మట్టిని తరలిస్తున్నారు. ఈ విషయంపై తెలుగుప్రభ దినపత్రికలో ప్రచురించి అక్రమ రేగడిని వెలుగులోకి తీసుకువచ్చింది. ఆ విషయంపై తెలుగుప్రభ దినపత్రికలో ప్రచురించిన వార్తలకు అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. యథేచ్చగా రేగడి మట్టిని కొట్టుకుపోతున్నారు.

- Advertisement -

మట్టి వ్యాపారులు ఒక్కొక్కరూ కోట్ల రూపాయల సొమ్మును పోగుచేసుకుట్టున్నారని సమాచారం. ఎలాంటి పర్మిషన్ లేకుండా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. తమదైన శైలిలో మైనింగ్ అధికారులను సంతృప్తి పరుస్తున్నారు అన్న ఆరోపణలు లేకపోలేదు. రేగడి మట్టే కదా అని వదిలేసినా దీని నుండి రావాలసిన ప్రభుత్వ ఆదాయానికి గండి పడనుంది. అయినా కూడా ప్రభుత్వ చెరువులలో అసైన్డ్ భూములలో ఈ అక్రమ రేగడి దందాను అడ్డుకునేవారు లేక ఇష్టారాజ్యంగా ఈ దందా కొనసాగుతోంది. ఇటుక బట్టీలకు రాగడి మట్టిని మడూరు, వెలికట్టే, ఇతర చెరువుల నుండి కూడా ఇటుక బట్టీల ఓనర్ మారిష్ అనే వ్యక్తి చెరువులలో నుండి మట్టిని తొవ్వి సొమ్ముచేసుకుంటున్నారు. చెరువుల కుంటల నుండి మట్టిని మాయం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మామూళ్ల మత్తులో అధికారులు

మట్టి మాఫియాలో దూసుకుపోతున్న ఇటుక బట్టి వ్యాపారులు కోట్ల వ్యాపారానికి లక్షల్లో ముడుపులు ముడితే ప్రేక్షక పాత్ర పోషిస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ రేగడి మట్టి దందా మైనింగ్ అధికారుల కనుసన్నలలో నడుస్తుందని ఆరోపణలు లేకపోలేదు. చెరువులలో, కుంటలలో,అసైన్డ్ భూములలో ప్రొక్లైనర్లతో తవ్వి ట్రాక్టర్లతో తరలిస్తున్న అధికారులకు కనబడటం లేదా అనే ప్రశ్న తలెత్తుతోంది. ముఖ్యంగా మట్టి తవ్వకాలపై చర్యలు తీసుకోవాల్సిన మైనింగ్ అధికారులు నిద్ర మత్తులో తూగుతున్నారని ఆరోపణలు లేకపోలేదు.

పై అధికారులకు ఇన్ఫాం చేసి చర్యలు తీసుకుంటాం

ఇరిగేషన్ ఏఇ, శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటుక బట్టీలని సందర్శించి ఎలాగైన ఇటుక బట్టీలకు తరలించిన రేగడి మట్టి గురించి మా సిబ్బందితో తెలుసుకొని, పై అధికారులకు తెలియజేసి వారిపై చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ ఏఇ..శ్రీనివాసు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News