తెలంగాణలో ఒకేసారి ముగ్గురు బాలికలు మిస్ కావడం కలకలం రేపుతోంది. నిజామాబాద్(Nizamabad) జిల్లా నవీపేట్ మండల కేంద్రానికి చెందిన ముగ్గురు బాలికలు గురువారం ఉదయం పాఠశాలకు వెళ్తున్నామని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లారు. సాయంత్రమైనా వారు ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
- Advertisement -
ఈమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బాలికల ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ముగ్గురు కలిసి ఎక్కడికైనా వెళ్లారా? లేదా ఎవరైనా కిడ్నాప్ చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.