Friday, January 23, 2026
HomeతెలంగాణThummala: దక్షిణాది రాష్ట్రాల మంత్రులతో మంత్రి తుమ్మల చర్చలు

Thummala: దక్షిణాది రాష్ట్రాల మంత్రులతో మంత్రి తుమ్మల చర్చలు

Thummala Nageswara Rao: ఆయిల్ పామ్ సాగుదారుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అంశంపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకోసం దక్షిణాది రాష్ట్రాలను కలుపుకోవాలని భావిస్తున్నారు. ఈమేరకు పలు రాష్ట్రాల వ్యవసాయం మంత్రులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆయిల్ పామ్ దిగుమతులపై ప్రస్తుత కస్టమ్స్ డ్యూటీని పెంచాలన్న అంశంపై చర్చలు జరిపారు.

- Advertisement -

ప్రస్తుతం కేంద్రం క్రూడ్ పామ్ ఆయిల్‌పై దిగుమతి సుంకాలను తగ్గించడం వల్ల దేశీయ మార్కెట్‌లో చౌకగా దిగుమతి ఆయిల్ లభిస్తోందని పేర్కొన్నారు. దీనివల్ల ఆయిల్ పామ్ ఉత్పత్తి చేస్తున్న దేశీయ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. మిల్లర్లు, రిఫైనర్లు, రిటైల్ వ్యాపారులకు మాత్రం లాభాలు కలుగుతున్నాయని కానీ రైతులకు అన్యాయం జరుగుతుందని వెల్లడించారు. ఈ పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనాలంటే దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరమని భావించారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల వ్యవసాయ మంత్రులకు, ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మిజోరం, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల వ్యవసాయ మంత్రులకు వ్యక్తిగతంగా లేఖలు రాశారు.

ఆయిల్ పామ్ దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ పెంచాలన్న డిమాండ్‌తో కేంద్రాన్ని కలిసి రైతుల పక్షాన గళం వినిపించాలని కోరారు. అవసరమైతే దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రులు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులతో ప్రత్యక్షంగా సమావేశం అవుదామని ఆయన సూచించారు. ఆయిల్ పామ్ సాగు దారులకు అనుకూలంగా దిగుమతి విధానాల్లో మార్పులు చేయాలన్న డిమాండ్‌ను వినిపించాలని కోరారు. ఆయిల్ పామ్‌కు మినిమమ్ గ్యారంటీ ప్రైస్ రూ.25,000గా నిర్ణయించాల్సిన అవసరాన్ని కూడా లేఖలో ప్రస్తావించారు. గతంలో మాదిరిగా క్రూడ్ పామ్ ఆయిల్‌పై దిగుబడి సుంకాన్ని 44 శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేశారు. రైతుల హక్కులు, జీవనోపాధి రక్షణ, దేశీయ ఆయిల్ పామ్ పరిశ్రమ స్థిరత్వం కోసం రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని మంత్రి పిలుపునిచ్చారు

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News