Sunday, October 6, 2024
HomeతెలంగాణTirumala: శ్రీవారి సేవలో బాజిరెడ్డి ఫ్యామిలీ

Tirumala: శ్రీవారి సేవలో బాజిరెడ్డి ఫ్యామిలీ

మూడవసారి పోటీ చేస్తున్న బాజిరెడ్డి

మూడవసారి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గం నుండి పార్టీ అభ్యర్థిగా బి ఫారం అందజేసిన సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారిని శుభ సూచకంగా కుటుంబ సమేతంగా వెంకన్నను దర్శించుకున్నారు నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి వినోద గోవర్ధన్ దంపతులు..
ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని, పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలందరిపై స్వామివారి దివ్య ఆశీస్సులు ఉండాలని ఆయన స్వామి వారిని కోరారు..
ఆయన వెంట నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఈగ సంజీవరెడ్డి పార్టీ నాయకులు అరవింద్ నిషిత కళాశాల చైర్మన్ వినయ్ తదితరులు పాల్గొన్నారు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News