Saturday, November 15, 2025
HomeతెలంగాణBJP: నేడో రేపో బీజేపీ జూబ్లీహిల్స్ అభ్యర్థి ఖరారు.. మహిళకే ఛాన్స్!

BJP: నేడో రేపో బీజేపీ జూబ్లీహిల్స్ అభ్యర్థి ఖరారు.. మహిళకే ఛాన్స్!

BJP Jubilee Hills candidate: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారనుంది. ఇప్పటికే అధికార పార్టీతో పాటు బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించారు. నేడో రేపో బీజేపీ అభ్యర్థిని సైతం ప్రకటించే అవకాశం ఉంది. గత వారం నుంచి అభ్యర్థిపై పార్టీ తీవ్ర కసరత్తు చేస్తుంది. నేడు దిల్లీలోని పార్టీ ప్రధానకార్యాలయంలో పీఎం మోదీ నేతృత్వంలో పార్లమెంటరీ బోర్డు మీటింగ్ జరగనుంది. ఈ భేటీలో బోర్డు సభ్యులైన పలువురు కేంద్ర మంత్రులతో పాటుగా తెలంగాణకు చెందిన ఎంపీ లక్ష్మణ్ సైతం పాల్గొననున్నారు. ఈ సమావేశంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సహా, ఎమిది రాష్ట్రాల్లో జరగనున్న బైపోల్స్‌లో పోటీచేయనున్న అభ్యర్థులను ఖరారు చేస్తారని సమాచారం.

- Advertisement -

ముఖ్య నేతలతో స్టేట్ చీఫ్ భేటి: నేడో రేపో బీజేపీ అభ్యర్థిని ప్రకటించనున్న నేపథ్యంలో పార్టీ స్టేట్ చీఫ్ రాంచంద‌‌ర్‌‌రావు దిల్లీ వెళ్లి పలువురు ముఖ్య నేతలతో భేటి అయ్యారు. బీఎల్ సంతోష్‌‌, సునీల్ బ‌‌న్సల్‌‌, ఇతర నేతలతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సహా పలు అంశాలపై చర్చించిన‌‌ట్లు తెలుస్తోంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడడం, పార్టీ పరిస్థితిపై ముఖ్యనేత‌‌ల‌‌కు సమాచారం అందించారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నిక‌‌ల క‌‌మిటీ ముగ్గురు పేర్లతో కూడిన జాబితాను ఖ‌‌రారు చేసింది. ఆ ముగ్గురు అభ్యర్థుల జాబితాను రాంచంద‌‌ర్‌‌రావు జాతీయ నాయ‌‌క‌‌త్వానికి అంద‌‌జేసిన‌‌ట్లు తెలుస్తోంది.

మహిళకే ఛాన్స్: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక నామినేషన్ గడువు దగ్గరపడుతుండటంతో బీజేపీ ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఆశావాహులు ఎవరికివారు తామ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే జూబ్లీహిల్స్‌ బరిలో బీజేపీ నుంచి జూటూరు కీర్తిరెడ్డి, లంకల దీపక్‌రెడ్డిల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ కసరత్తు చేసి జూటూరు కీర్తిరెడ్డి, లంకల దీపక్‌రెడ్డి, డాక్టర్‌ పద్మ, మాధవీలత పేర్లతో ఓ జాబితాను రూపొందించింది.

Also Read:https://teluguprabha.net/telangana-news/congress-party-focus-on-organizational-development-in-booth-level/

అదనపు పోస్టులకు అభ్యంతరం తెల్పిన హైకమాండ్: బీజేపీ రాష్ట్ర కమిటీలో ఆఫీస్ బేరర్ల సంఖ్యను పెంచేందుకు పార్టీ హైకమాండ్ అభ్యంతరం తెల్పింది. సంప్రదాయంతో కూడిన నిబంధనల ప్రకారం పార్టీ ఆఫీస్ బేరర్‌లతో ఇటీవల పార్టీ కమిటీని వేసింది. అయితే దిల్లీ పర్యటనలో భాగంగా ప్రస్తుతం పార్టీలో ఆశావహుల సంఖ్య పెరిగిన‌‌ కారణంగా.. అదనంగా వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ పోస్టులు ఇవ్వాలని పార్టీ హైకమాండ్‌ను రాంచందర్ రావు కోరారు. అయితే పార్టీ పెద్దలు ఈ అంశంపై నో చెప్పారు. ఈ అదనపు పోస్టులతో జంబో లిస్ట్ కు హైకమాండ్ నిరాకరించింది. దీంతో పార్టీలో పదవులు ఆశిస్తున్న వారికి మళ్లీ నిరాశే మిగిలింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad