Singer ande sri passes away:ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. ఇవాళ ఉదయం లాలాగూడలోని తన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన ఆయన కుమారులు.. గాంధీ ఆస్పత్రికి తరలించారు. 7 గంటల 20 నిమిషాలకు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అయితే 7 గంటల 25 నిమిషాలకు అందెశ్రీ చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. దీంతో తెలంగాణ సాహితీ లోకం కన్నీటిసంద్రంలో మునిగిపోయింది. అందెశ్రీ సుదీర్ఘమైన పజాసాహిత్యాన్ని తెలంగాణ సమాజానికి అందించారు. చదువుకోకున్నా అద్భుతమైన రచనలు చేశారు.
- Advertisement -


