Saturday, November 15, 2025
HomeTop StoriesBC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోపై ఉత్కంఠ.. నేడు సుప్రీంకోర్టులో విచారణ!

BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోపై ఉత్కంఠ.. నేడు సుప్రీంకోర్టులో విచారణ!

BC Reservations GO in Supreme Court: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీసీ రిజర్వేషన్ల అంశం రోజుకో మలుపు తిరుగుతుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నెల 9న తొలిదశ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. దీంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ కీలక పరిణామాల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల జీవో చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కోర్టుల్లో బలమైన వాదనలు వినిపించేందుకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పార్టీ నేతలను ఆదేశించారు.

- Advertisement -

దిల్లీకి మంత్రులు: ఈ అంశంపైనే చర్చించేందుకు బీసీ మంత్రులు ఆదివారం దిల్లీకి చేరుకున్నారు. న్యాయ కోవిదులతో సంప్రదింపులు జరిపారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థలు, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రచార కార్యాచరణపైనా చర్చించినట్లు నేతలు తెలిపారు. సీనియర్‌ న్యాయకోవిదులతో ముందే మాట్లాడాలన్న సీఎం ఆదేశాల మేరకు మంత్రులు దిల్లీకి వెళ్లారు.

Also read:https://teluguprabha.net/telangana-news/plan-b-for-tg-local-body-elections/

రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నం: రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు తీసుకుంటున్న చర్యలను కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ రిజర్వేషన్ల పెంపు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన రిజర్వేషన్లకు ఎలాంటి నష్టం కలిగించేది కాదని ఆయన స్పష్టం చేశారు. బలహీన వర్గాలకు చేయూతనివ్వాలనే సదుద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముందుకు వెళ్తున్నారని అన్నారు. రాహుల్‌గాంధీ ఆలోచనల అమలు ప్రక్రియలో భాగంగానే రిజర్వేషన్లను పెంచామని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల ఏకాభిప్రాయంతోనే అసెంబ్లీలో రిజర్వేషన్ల పెంపు బిల్లు ఆమోదం పొందిందని మంత్రి పొన్నం అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad