BC reservations in Supreme Court: బీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీఓ 9పై హైకోర్టు విధించిన స్టేను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఈ పిటిషన్ నేడు సుప్రీంకోర్టు ముందు విచారణకు రానుంది. జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరపనుంది. ఐటెం నం.49 కింద ఈ పిటిషన్ లిస్ట్ అయ్యింది. జీఓ 9పై స్టే విధిస్తూ హైకోర్టు ఈ నెల 9న జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్‌చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 13న ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసింది. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా 16, 17వ తేదీల్లో ఏదో ఒకరోజు ఈ అంశంపై విచారించాలని మంగళవారం సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో రిజిస్ట్రార్ ఈ కేసును నేటి నాటి జాబితాలో చేర్చారు.
మంత్రివర్గంలో చర్చుకు రానున్న బీసీ అంశం: ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం నేడు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సమావేశం కానుంది. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగా ఎన్నికల నిర్వహణ విషయంలో కేబినెట్ నిర్ణయం తీసుకోనుందని సమాచారం. పాత విధానంలో రిజర్వేషన్లను అమలు పరుస్తూ ఎన్నికలు నిర్వహించుకోవాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చి న మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇస్తే.. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశంపై కేబినెట్ మీటింగ్‌లో చర్చించనున్నారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/konda-sushmita-patel-hot-comments-on-cm-revanth-reddy/
42శాతంకు అవకాశం ఇస్తే: సుప్రీంకోర్టు బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు అవకాశం ఇస్తే ఎలాంటి ఆలస్యం చేయకుండా.. పంచాయతీ ఎన్నికలకు రేవంత్ ప్రభుత్వం వెళ్లనుంది. ఒకవేళ స్టే నిరాకరిస్తూ తదుపరి నిర్ణయాలపై చర్చ జరగనుంది. హైకోర్టు సూచనల మేరకు పాత రిజర్వేషన్ల విధానంలోనే ఎన్నికలకు వెళ్లాలని సర్వోన్నత న్యాయస్థానం చేప్పినా.. తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై మంత్రివర్గం చర్చించి ఓ నిర్ణ యం తీసుకునే అవకాశం ఉంది.


