తెలంగాణ అసెంబ్లీ చరిత్రలోనే ఇవాళ చీకటి రోజని నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం(Vemula Veeresham) తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. దళితుడైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar)ను బీఆర్ఎస్ పార్టీ పదే పదే అవమానిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సభ్యుల కోతి చేష్టలను తెలంగాణ సమాజం గమనిస్తోందన్నారు.
గతంలో వెల్‌లోకి రాకూడదు, పేపర్లు విసరకూడదని రూల్స్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీ సభ్యులు.. ఇప్పుడు వెల్‌లోకి వచ్చి స్పీకర్‌పై పేపర్లు విసిరారని మండిపడ్డారు. ఆ పార్టీ సభ్యులను ఎందుకు సస్పెండ్ చేయకూడదో చెప్పాలని ప్రశ్నించారు. ఎలాగైనా సభ నుంచి బయటకు రావాలని అన్నట్లుగా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. చర్చ జరగకుండా సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ధరణి (Dharani) పేరుతో ఓ సామాజికవర్గం పెద్ద ఎత్తున రాష్ట్రంలో భూములను కొల్లగొట్టిందని ఆరోపించారు.