Saturday, November 15, 2025
HomeతెలంగాణCabinet meeting: స్థానిక ఎన్నికలపై ఉత్కంఠ.. నేడు కీలక నిర్ణయం తీసుకోనున్న రేవంత్ సర్కార్!

Cabinet meeting: స్థానిక ఎన్నికలపై ఉత్కంఠ.. నేడు కీలక నిర్ణయం తీసుకోనున్న రేవంత్ సర్కార్!

Local body elections: స్థానిక ఎన్నికల విషయంలో ముందుకు వెళ్లే అంశంపై రాష్ట్ర మంత్రివర్గం నేడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 9 అమలును రాష్ట్ర హైకోర్టు నిలిపివేయడంతో.. నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. అయితే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ రేవంత్ సర్కార్ దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో.. ఎన్నికల నిర్వహణపై మరింత ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్ల పేరుతో ఎన్నికలను వాయిదా వేయడంపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో రేవంత్ ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహా కోరింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్య క్షతన సచివాలయంలో గురువారం మధ్యాహ్నం 4 గంటలకు కేబినెట్‌ సమావేశం కానుంది. ఎన్నికల విషయంలో న్యాయ నిపుణులు ఇచ్చిన సలహాపై చర్చించి.. నేడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే పాత విధానంలో రిజర్వేషన్లను అమలు చేస్తూ ఎన్నికలు నిర్వహించుకోవచ్చని రాష్ట్ర హైకోర్టు ..మధ్యంతర ఉత్తర్వుల్లో తెలిపింది. దీంతో పాత రిజర్వేషన్లను అమలు చేయడం తప్ప ప్రభుత్వానికి మరో మార్గం కనిపించడం లేదు.

- Advertisement -

స్థానిక ఎన్నికలపై పంచాయతీరాజ్ కీలక ఆదేశాలు: స్థానిక ఎన్నికలపై రేవంత్ సర్కార్‌ మళ్లీ కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ అంశంపైనే అంతర్గత చర్చలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని అధికారులు, ఉద్యోగులకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు సైతం జారీచేసింది. అయితే ఎన్నికలు ఎప్పుడు జరగొచ్చు అనే దానిపై నేడు జరిగే మంత్రివర్గం సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ఖరారుతోపాటు ఎన్నికల తేదీలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులకు పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలను జారీచేసింది. ఎన్నికలపై ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా..ఏ ర్పాట్లకు సిద్ధంగా ఉండాలని సూచించినట్టుగా తెలుస్తోంది.

Also Read:https://teluguprabha.net/telangana-news/panchayat-raj-important-instructions-to-govt-officials/

న్యాయస్థానాల ఆదేశంతోనే ముందస్తు చర్యలు: స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను కొట్టేయడంతో పాటుగా 50 శాతం రిజర్వేషన్లు దాటకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా హైకోర్టు సైతం గత వారంలో ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ)కు కీలక ఆదేశాలను జారీ చేసింది. రెండువారాల్లోగా స్థానిక ఎన్నికల నిర్వహణ తేదీలను తెలియజేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. దీంతో ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందని పంచాయతీరాజ్ శాఖ భావిస్తోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad