Hero bhanu chandar: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. రాజకీయాలతో సంబంధం లేనివారు సైతం తమ తమ అభ్యర్థులకు మద్దతిస్తున్నారు. మొన్నటికి మొన్న నవీన్ యాదవ్‌కు మద్దతుగా టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్ వీడియో విడుదల చేశారు. అదిమరువక ముందే ఒకప్పటి యాక్షన్ హీరో భానుచందర్ సైతం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఆయన సెల్ఫీ వీడియో సందేశాన్ని కూడా విడుదల చేశారు. చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని జూబ్లీహిల్స్ ఓటర్లను కోరారు.
పులిబిడ్డ పులే అవుతుంది కానీ పిల్లి అవ్వదు: నవీన్ యాదవ్‌కు మంచి భవిష్యత్ ఉందని హీరో భానుచందర్ అన్నారు. గొప్ప పేరు సంపాదించుకునే అవకాశం ఉందని తెలిపారు. తండ్రిని మించిన తనయుడు అవుతాడని తెలిపారు. పులిబిడ్డ పులే అవుతుంది కానీ పిల్లి అవ్వదని నవీన్ యాదవ్‌ను ఉద్దేశించి అన్నారు. పేదలకు సాయం చేసే వ్యక్తి నవీన్ యాదవ్ అని హీరో భానుచందర్ వ్యాఖ్యానించారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/today-decide-bjp-jubilee-hills-candidate-name/
యువతలో క్రేజ్ ఉన్న నేత: నవీన్ యాదవ్ జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గంలో అంజన్ కుమార్ యాదవ్ లాంటి సీనియర్లు ఉన్నప్పటికీ వారిని కాదని నవీన్ యాదవ్‌కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. యువనేత కావడంతోపాటుగా యువతలో అతడికి మంచి క్రేజ్ ఉంది. అంతేకాకుండా చాలా కాలంగా నవీన్ పార్టీలో చురుకుగా ఉంటూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న అంశాన్ని అధిష్టానం గమనించి.. అతడికి టికెట్ కేటాయించింది. దీంతో అతడి గెలపుపై పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
నవీన్ యాదవ్ మంచి వాడు…
తప్పకుండా గెలిపించాలి…జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో సినీ నటుడు భానుచందర్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతు ప్రకటించారు.
Film Actor BhanuChander released a video expressing support for Jubilee Hills Congress candidate Naveen Yadav.… pic.twitter.com/du6sNMtHSV
— Congress for Telangana (@Congress4TS) October 12, 2025


