Sunday, November 16, 2025
HomeతెలంగాణSchool Holidays : విద్యార్థులకు అలర్ట్‌.. రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు.. వివరాలివే!

School Holidays : విద్యార్థులకు అలర్ట్‌.. రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు.. వివరాలివే!

Guru Nanak Jayanti 2025: విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రకటన రానే వచ్చేసింది. గురునానక్‌ జయంతి, కార్తీక పౌర్ణమి సందర్భంగా సెలవు విషయంపై క్లారిటీ వచ్చేసింది. తెలంగాణలో రేపు పబ్లిక్‌ హాలిడే ఉండనుంది. గురునానక్‌ జయంతి సందర్భంగా అన్ని విద్యా సంస్థలకు, ప్రభుత్వ ఆఫీసులకు సెలవు ప్రకటించారు. అయితే.. ఏపీలో మాత్రం ఆప్షనల్‌ హాలిడేను ఇచ్చారు. దీంతో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే స్కూళ్లకు సెలవు ప్రకటించారు. మిగిలిన చోట్ల మాత్రం యథావిధిగా విద్యాసంస్థలు నడవనున్నాయి. గురు నానక్ జయంతిని గురుపురబ్, గురునానక్ ప్రకాష్ ఉత్సవ్ అని పిలుస్తారు. తొలి సిక్కు గురువు గురు నానక్ జయంతిని సిక్కు సమాజం మొత్తం పెద్ద పండుగగా జరుపుకోనుంది.

- Advertisement -

గురునానక్ జయంతిని ఎలా జరుపుకుంటారు: తొలి సిక్కు గురువు గురు నానక్ జయంతిని సిక్కు సమాజం మొత్తం జరుపుకునే అతి పెద్ద పండగ. గురునానక్ జయంతిని సిక్కు ప్రజలు మూడు రోజుల పాటు ఆనందంగా జరుపుకుంటారు. గురుద్వారాలలో అఖండ్ పథ్ నిర్వహిస్తారు. అఖండ్ పథ్ అనగా సిక్కు ప్రజలు తన ఆధ్యాత్మిక పుస్తకాన్ని 48 గంటల పాటు నిరంతరం చదివే ఒక ఆచారం. ఈ విలువైన పండుగ సందర్భంగా ప్రజలు పంజ్ ప్యారాస్ నేతృత్వంలో ఊరేగింపు నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఈ ఊరేగింపులో సిక్కు జెండాను ఊరేగింపుగా తీసుకువెళతారు. పండుగ రోజున ఉదయాన్నే సిక్కు ప్రజలు అస-ది-వర్ పాడతారు. అనంతరం గురుద్వారాలలో పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం లంగర్ తయారు చేస్తారు. స్నేహితులు, కుటుంబాలు మరియు బంధువులు కలిసి పవిత్ర గీతాలను పాడతారు.

Also Read:https://teluguprabha.net/telangana-news/minister-ponnam-prediction-on-jubilee-hills-by-election/

హిందువుల పవిత్రదినం కార్తీకపౌర్ణమి: ప్రస్తుతం కార్తీకమాసం కొనసాగుతోంది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ఈ నెలను హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అందులోను కార్తీక పౌర్ణమి మరింత ప్రత్యేకమైనది. అందుకే రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad