Mahesh Kumar Goud serious on congress MLA: కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో సీఎం చంద్రబాబు కోవర్టులు ఉన్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై మండిపడడ్డారు. గాంధీ భవన్‌లో మాట్లాడుతూ.. పార్టీ నేతలు ఏ విషయం గురించి అయినా మాట్లాడేట్పుడు ఆచితూచి మాట్లాడాలని హెచ్చరించారు. పార్టీ క్రమశిక్షణ విషయంలో రాజీ పడేడి లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అనిరుధ్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని పేర్కొన్నారు. దీనిపై వివరణ కోరతామని తెలిపారు.
అసలు ఏం జరిగిందంటే.. అనిరుధ్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారని నోరు జారారు. రాష్ట్రంలో చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు, హైదరాబాద్‌లో దందాలు చేస్తున్నారని ఆరోపించారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లెటర్లు రాయండ కాదన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు ఒక్క రూపాయి ఇవ్వకండరి సూచించారు.. అలాంటి వారి ఇళ్లకు నల్లా నీరు, కరెంట్ కనెక్షన్ ఆపితే చంద్రబాబు దగ్గరికి వెళ్లి బనకచర్ల ప్రాజెక్టును ఆపమని అడుక్కుంటారంటూ ఘాట వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఈ ఆంధ్రోళ్లకు మంచిగా చెబితే వినరని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం సీరియస్ అయింది.
అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలను మరింత దూరం చేస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో కూడా అనిరుధ్ రెడ్డి పార్టీకి ఇబ్బంది కలిగేలా వ్యవహరించారు. గతంలోనూ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సుల లేఖలు అంగీకరించట్లేదని ఫైర్ అయ్యారు. తమ లేఖలు అంగీకరించకపోతే ఆంధ్రోళ్లను తెలంగాణలో తిరగనివ్వమని హెచ్చరించారు. ఆ వ్యాఖ్యలపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. కాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జడ్చర్ల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా అనిరుధ్ రెడ్డి విజయం సాధించారు.