Saturday, November 15, 2025
HomeతెలంగాణBy election: కాంగ్రెస్ హై కమాండ్‌కు నలుగురి పేర్లు.. తెరపైకి బొంతు రామ్మోహన్!

By election: కాంగ్రెస్ హై కమాండ్‌కు నలుగురి పేర్లు.. తెరపైకి బొంతు రామ్మోహన్!

Jubilee hills by election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిపై కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్ తయారు చేసింది. ఆశావాహుల పేర్లను పరిశీలించిన టీపీసీసీ నలుగురి పేర్లతో షాక్ లిస్టును తయారు చేసింది. ఇందులో నవీన్ యాదవ్, సీఎన్ రెడ్డి, బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ పేర్లు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ లిస్టును అధిష్ఠానానికి పంపితే ఏఐసీసీ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అభ్యర్థిని ఫైనల్ చేయనుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించడంతో జూబ్లీహిల్స్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అంతేకాకుండా బీజేపీ సైతం తమ అభ్యర్థిని ఫైనల్ చేసేందుకు.. స్టేట్ చీఫ్ రాంచందర్ రావు ముగ్గురికి బాధ్యతలు అప్పగించారు.

- Advertisement -

తెరపైకి బొంతు రామ్మోహన్: అందరితో సన్నిహిత సంబంధాలు ఉన్న బొంతు రామ్మోహన్ వైపే హై కమాండ్ మొగ్గు చూపేలా ఉందని సమాచారం. ఇప్పటికే అతను జీహెచ్ఎంసీ మేయర్ గా పనిచేసిన అనుభవంతో పాటు.. అన్ని ప్రాంతాలపై పట్టు ఉందని తెలుస్తుంది. బొంతు రామ్మోహన్ 2023 వరకు బీఆర్ఎస్ లో ఉండగా శాసనసభ ఎన్నికల సమయంలో బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ లో చేరారు.

రాజీనామాకు సిద్ధమైన దానం నాగేందర్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి దానం నాగేందర్ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తుంది. 2023లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం.. ఎంపీ ఎలక్షన్ల ముందు 2024లో కాంగ్రెస్ లో చేరారు. అనంతరం సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇదే అంశాన్ని ఇటీవల బీఆర్ఎస్ నేతలు ఆధారాలతో సహా స్పీకర్ కు అందించారు. అయితే స్పీకర్ అనర్హత వేటు వేయకముందే దానం రాజీనామా చేసి.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ హై కమాండ్ కు పీసీసీ పంపించిన షార్ట్ లిస్టులో దానం పేరు లేదు. దీంతో హై కమాండ్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అభ్యర్థిని ప్రకటించక ముందే తాను రాజీనామా చేయాలని దానం చూస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad