Balkampet Yellamma Kalyanam: తెలంగాణలో అత్యంత ప్రసిద్ధమైన బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానంలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ తల్లి కల్యాణ ఉత్సవాలు జరుగుతాయి. అయితే ఈ జూలై 1వ తేదీన ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జూన్ 30 నుంచి జూలై 2 వరకు మూడు రోజులపాటు ప్రత్యేక వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలకు భక్తులు వేలాదిగా హాజరవుతారు. వివిధ ప్రాంతాల నుంచి బల్కంపేట ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవడానికి వస్తుంటారు. భారీగా భక్తులు హాజరవడం వలన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు, నియంత్రణలు అమలు చేయనున్నారు. వాహనదారులు ఈ మార్పులను గమనించి, ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించాలని సూచిస్తున్నారు.
ఎల్లమ్మ తల్లి కల్యాణోత్సవం వలన కలిగే ముఖ్యమైన ట్రాఫిక్ మార్పులు
గ్రీన్ ల్యాండ్ / సత్యం థియేటర్ నుంచి ఫతేనగర్ వైపు:
ఈ ప్రాంతాల నుంచి ప్రయాణిస్తున్న వాహనాలు:
ఎస్ఆర్ నగర్ టీ జంక్షన్,
ఎస్ఆర్ నగర్ కమ్యూనిటీ హాల్,
అభిలాష టవర్,
బీకే గూడ క్రాస్ రోడ్,
శ్రీరామ్ నగర్ క్రాస్ రోడ్ ద్వారా ఫతేనగర్ లేదా సనత్ నగర్ వైపు వెళ్లాల్సి ఉంటుంది.
ఫతేనగర్ ఫ్లైఓవర్ నుంచి బల్కంపేట దిశగా:
బేగంపేట్ కట్ట మైసమ్మ టెంపుల్ వద్ద నిర్మించిన కొత్త బ్రిడ్జి దాటి,
గ్రీన్ ల్యాండ్ బకుల్ అపార్ట్మెంట్స్, సోనాబాయ్ టెంపుల్ దాటి
సత్యం థియేటర్ మైత్రివనం వైపు వెళ్లాలి.
బేగంపేట్ మైసమ్మ టెంపుల్ నుంచి బల్కంపేట వైపు:
వాహనాలు గ్రీన్ ల్యాండ్ → మాత టెంపుల్ → సత్యం థియేటర్ దాటి
ఎస్ఆర్ నగర్ టీ జంక్షన్ వద్ద ఎడమవైపు తిరిగి
ఎస్సార్ నగర్ కమ్యూనిటీ హాల్ మీదుగా ప్రయాణించాలి.
అలాగే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఉత్సవానికి వచ్చే భక్తుల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు:
ఆర్ అండ్ బీ ఆఫీస్,
జీహెచ్ఎంసి గ్రౌండ్,
పద్మశ్రీ నుంచి నేచర్ క్యూర్ హాస్పిటల్ రోడ్ వరకు ఉన్న ప్రాంతాలలో భద్రతతో కూడిన పార్కింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది.
అత్యవసర సమాచారం కోసం:
వాహనదారులకు అవసరమైన సమాచారం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల హెల్ప్‌లైన్ నంబర్: 9010203626కు కాల్ చేయొచ్చు.
సమాచారాన్ని తెలుసుకోవడానికి అధికారిక సోషల్ మీడియా పేజీలు.. facebook.com/HYDTP, Twitter: @HYDTPను ఫాలో చేయొచ్చు.