Saturday, November 15, 2025
HomeతెలంగాణTraffic Diversions: హైదరాబాద్ వాసులకు బిగ్ అలెర్ట్.. ఆ ఏరియాల్లో వెళ్తే ఇక అంతే!

Traffic Diversions: హైదరాబాద్ వాసులకు బిగ్ అలెర్ట్.. ఆ ఏరియాల్లో వెళ్తే ఇక అంతే!

Ujjayini Mahankali: హైదరాబాద్‌ సికింద్రాబాద్‌లో ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణలు విధించబడ్డాయి. జూలై 13వ తేదీ ఉదయం 6 గంటల నుంచి జూలై 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. ఈ నిబంధనలు ఆలయం చుట్టుపక్కల రెండు కిలోమీటర్ల పరిధిలో వర్తించనున్నాయి. ముఖ్యంగా కర్బలా మైదాన్, రాణిగంజ్, రామ్‌గోపాల్‌పేట్, ప్యారడైజ్, సీటీవో ప్లాజా, ఎస్‌బీఐ క్రాస్ రోడ్, వైఎంసీఏ, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్, పట్నీ, బాటా, ఘాస్‌మండి, బైబిల్ హౌస్, మినిస్టర్ రోడ్, రసూల్‌పుర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయి.

- Advertisement -

ఇందులో భాగంగా టొబాకో బజార్, హిల్ స్ట్రీట్, బాటా క్రాస్ రోడ్స్ నుంచి పాత రామ్‌గోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్ వరకు సుభాష్ రోడ్ మార్గాన్ని మూసివేయనున్నారు. అదే విధంగా, జనరల్ బజార్ నుంచి ఆలయానికి వెళ్లే రహదారులు కూడా తాత్కాలికంగా నిలిపివేయబడతాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే వాహనాలను రాణిగంజ్ వద్ద నుంచి మినిస్టర్ రోడ్, రసూల్‌పుర, పీఎన్‌టి ఫ్లైఓవర్, హెచ్‌పీఎస్ యూ టర్న్, సీటీవో, ఎస్‌బీఐ, వైఎంసీఏ, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్, గోపాలపురం లేన్ మీదుగా మళ్లించనున్నారు. అలాగే, ఘాస్‌మండి క్రాస్ రోడ్స్ వద్ద బైబిల్ హౌస్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను సజ్జన్‌లాల్ స్ట్రీట్, హిల్ స్ట్రీట్‌ వైపు మళ్లిస్తారు. పట్నీ వద్ద ఎస్‌బీహెచ్, క్లాక్ టవర్, ప్యారడైజ్ ప్రాంతాలకు వెళ్లే వాహనాల రూట్లు కూడా డైవర్ట్ చేయనున్నారు.

ప్రముఖ కూడళ్ల వద్ద వాహనాల పార్కింగ్‌కి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సెయింట్ జాన్స్ రోటరీ, స్వీకార్ ఉపకార్, హరిహర కళాభవన్, మహబూబియా కాలేజీ, కర్బలా మైదాన్, బైబిల్ హౌస్, ఇస్లామియా హై స్కూల్ (ఘాస్‌మండి), ఆదాయ మెమోరియల్ హై స్కూల్ (ఆదాయ క్రాస్ రోడ్స్), ఓల్డ్ జైల్‌ఖానా (సుభాష్ రోడ్), అంజలి థియేటర్ లేన్ (మంజు థియేటర్ దగ్గర), మహాత్మాగాంధీ విగ్రహం (రసూల్‌పుర) వద్ద వాహనాలు నిలుపుకోవచ్చు.

అంతేగాక, బోనాల ఉత్సవాల సందర్భంగా గాంధీనగర్, చిలకల్‌గూడ, లాలగూడ, వారసిగూడ, బేగంపేట్, గోపాలపురం, తుకారంగేట్, మారేడ్‌పల్లి, మహంకాళి, రామ్‌గోపాల్‌పేట్, మార్కెట్ ప్రాంతాల్లో జూలై 13 నుంచి 15 వరకు మద్యం షాపులు, బార్‌లు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ట్రాఫిక్ పోలీసుల సూచనలు ఖచ్చితంగా పాటించాలని, నిబంధనలు అతిక్రమించిన వారి పై కఠిన చర్యలు తీసుకోబడతాయని అధికారులు హెచ్చరించారు. అత్యవసర సమయంలో ట్రాఫిక్ సహాయానికి 9010203626 నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad