Sunday, July 7, 2024
HomeతెలంగాణBRS : టీఆర్ఎస్ పేరు మార్పుపై ఈసీ కీల‌క నిర్ణ‌యం

BRS : టీఆర్ఎస్ పేరు మార్పుపై ఈసీ కీల‌క నిర్ణ‌యం

BRS : తెలంగాణ రాష్ట్ర స‌మితిని ‘భార‌తీయ రాష్ట్ర స‌మితి’గా పేరు మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణ‌యం తీసుకుంది. పేరు మార్పుపై పార్టీ అధ్య‌క్షుడు సీఎం కేసీఆర్‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం అధికారిక లేఖ పంపింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 9న‌ శుక్రవారం మధ్యాహ్నం 1: 20 నిమిషాలకు “భారత రాష్ట్ర సమితి” ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించారు. అదే శుభ‌ముహూర్తాన ఎన్నిక‌ల సంఘం పంపిన లేఖ‌పై కేసీఆర్ సంత‌కం చేసి రిప్లైగా పంపాల‌ని బావిస్తున్నారు.

- Advertisement -

అనంత‌రం బీఆర్ఎస్‌ జండాను ఆవిష్కరించ‌నున్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో నిర్వ‌హించే ఈ కార్య‌క్ర‌మానికి రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజ‌రుకావాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశించారు. వీరితో పాటు జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డిసిసిబి అధ్యక్షులు డీసీఎంఎస్ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్యులు అందరూ శుక్రవారం మధ్యాహ్నం లోపు తెలంగాణ భవనకు చేరుకోవాలని సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News