TS Govt : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో 3,897 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో కాలేజీకి 433 పోస్టుల చొప్పున భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు.
రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కొమరంభీం ఆసిఫాబాద్, జనగాం, నిర్మల్‌లోని వైద్య కాలేజీలు, వాటి అనుబంధ ఆస్పత్రులకు పోస్టులకు మంజూరు అయినట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఆరోగ్య తెలంగాణ దిశగా మరో ముందడుగు పడిందన్నారు. అందరికీ సరైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఏఏ క్యాటరీలో ఎన్ని పోస్టులు భర్తీ చేయనున్నారనే వివరాలను మంత్రి తన ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు.
Big Boost to #AarogyaTelangana, Under visionary leadership of #CMKCR garu to provide accessible Healthcare for all. TS Govt accorded sanction for creation of 3897 posts in various categories 9 Medical Colleges & attached Govt General Hospitals under Director Medical Education 1/2 pic.twitter.com/7Olsdoc1ae
— Harish Rao Thanneeru (@trsharish) December 1, 2022