Saturday, October 5, 2024
HomeతెలంగాణGroup-4 Notification : తెలంగాణ‌లో గ్రూప్‌-4 నోటిఫికేష‌న్ విడుద‌ల‌

Group-4 Notification : తెలంగాణ‌లో గ్రూప్‌-4 నోటిఫికేష‌న్ విడుద‌ల‌

Group-4 Notification : తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల‌కు శుభ‌వార్త ఇది. గ‌త కొద్ది రోజులుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) గ్రూప్‌-4 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. మొత్తం 9,168 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు తెలిపింది. ఈ నెల‌(డిసెంబ‌ర్‌) 23 నుంచి జ‌న‌వ‌రి 12 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెల‌లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది.

- Advertisement -

ఈ నోటిఫికేష‌న్‌లో జూనియ‌ర్ అసిస్టెంట్‌, జూనియ‌ర్ అకౌంటెంట్, జూనియ‌ర్ ఆడిట‌ర్‌, వార్డ్ ఆఫీస‌ర్ పోస్టులు భారీగా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం అభ్య‌ర్థులు tspsc.gov.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

శాఖ‌ల వారీగా కొన్ని పోస్టుల వివ‌రాలు..

  • అగ్రికల్చర్‌, కో ఆపరేటివ్ శాఖలో 44,
  • పశు సంవర్ధక శాఖ, డైరీ డెవలప్ మెంట్‌లో 2,
  • బీసీ వెల్ఫేర్‌లో 307,
  • పౌర సరఫరాల శాఖలో 72,
  • ఎన‌ర్జీ డిపార్ట్‌మెంట్‌లో 2,
  • ఆర్థిక శాఖలో 255,
  • అర్బన్ డెవల్మెంట్ లో 2,701
  • ఉన్నత విద్యా శాఖలో 742
  • రెవెన్యూ శాఖలో 2,077
  • ఎస్సీ వెల్ఫేర్ లో 474
  • లేబర్ డిపార్ట్మెoట్ లో 128
  • ట్రైబల్ వెల్ఫేర్ లో 221
  • హోమ్ శాఖలో 133
  • పాఠశాల విద్యా శాఖలో 97
  • పంచాయ‌తీ రాజ్ శాఖ‌లో 1,245 ల‌కు నోటిఫికేష‌న్‌ను జారీ చేసింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News