Tuesday, September 17, 2024
HomeతెలంగాణTSPSC Notification : శుభ‌వార్త‌.. సంక్షేమ హాస్ట‌ళ్ల‌లో ఉద్యోగాలు.. ఎన్నంటే..?

TSPSC Notification : శుభ‌వార్త‌.. సంక్షేమ హాస్ట‌ళ్ల‌లో ఉద్యోగాలు.. ఎన్నంటే..?

TSPSC Notification : తెలంగాణ రాష్ట్రంలో గ‌త కొద్ది రోజులుగా కొలువుల జాత‌ర న‌డుస్తోంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వ‌రుస‌గా నోటిఫికేష‌న్లు విడుద‌ల చేస్తోంది. వెట‌ర్న‌రీ స‌ర్జ‌న్ 185, హార్టిక‌ల్చ‌ర్ ఆఫీస‌ర్ 22 పోస్టుల‌కు గురువారం నోటిఫికేన్ ఇవ్వ‌గా తాజాగా సంక్షేమ హాస్ట‌ళ్ల‌ల‌లో పోస్టుల నియామ‌క ప్ర‌క్రియ‌ను ప్రారంభించింది. ఈ మేర‌కు నోటిఫికేష‌న్ జారీ చేసింది. 581 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందులో హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్, వార్డెన్‌, మ్యాట్ర‌న్ పోస్టుల‌తో పాటు మ‌హిళా సూప‌రింటెండెంట్ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ ఉద్యోగాల‌కు జ‌న‌వ‌రి 6 నుంచి 27 తేదీ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. మ‌రిన్ని వివ‌రాల కోసం https://www.tspsc.gov.in ని సంద‌ర్శించొచ్చు.

- Advertisement -

ఖాళీల వివ‌రాలు ఇవే.

  • హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -1(ట్రైబ‌ల్ వెల్ఫేర్) – 05
  • హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2(ట్రైబ‌ల్ వెల్ఫేర్) – 106
  • హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2 మ‌హిళ‌లు (ఎస్సీ డెవ‌ల‌ప్‌మెంట్‌) – 70
  • హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2 పురుషులు (ఎస్సీ డెవ‌ల‌ప్‌మెంట్) – 228
  • హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2 (బీసీ వెల్ఫేర్) – 140
  • వార్డెన్ గ్రేడ్ -1 (డైరెక్ట‌ర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్) – 05
  • మ్యాట్ర‌న్ గ్రేడ్ -1 (డైరెక్ట‌ర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్) – 03
  • వార్డెన్ గ్రేడ్ -2 (డైరెక్ట‌ర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్) – 03
  • మ్యాట్ర‌న్ గ్రేడ్ -2 (డైరెక్ట‌ర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్) – 02
  • లేడి సూప‌రింటెండెంట్ చిల్డ్ర‌న్ హోం (ఉమెన్ అండ్‌ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్) – 19
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News