Junior Lecturer Posts : తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ శుభవార్త చెప్పింది. మరో జాబ్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా జూనియర్ లెక్చరర్(జేఎల్) పోస్టులకు నోటిఫికేషన్ ను జారీ చేసింది. మొత్తం 1392 జేఎల్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 16 నుంచి జనవరి 6 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. వచ్చే ఏడాది జూన్ లేదా జులైలో పరీక్షను నిర్వహించనున్నారు. 27 సబ్జెక్టుల్లో మల్టీ జోన్ 1 లో 724, మల్టీ జోన్ 2 లో 668 పోస్టులను భర్తీ చేయనున్నారు.
సబ్జెక్టుల వారీగా పోస్టుల వివరాలు ఇవే..
అరబిక్ – 02, బోటనీ – 113, బోటనీ (ఉర్దూ మీడియం)-15, కెమిస్ట్రీ – 113, కెమిస్ట్రీ(ఉర్దూ మీడియం) – 19, సివిక్స్ – 56, సివిక్స్ (ఉర్దూ మీడియం) – 16, సివిక్స్ (మారాఠీ) – 01, కామర్స్ – 50, కామర్స్ (ఉర్దూ మీడియం) – 07, ఎకనామిక్స్ – 81, ఎకనామిక్స్ (ఉర్దూ) – 15, ఇంగ్లీష్ – 81, ఫ్రెంచ్ – 02, హిందీ – 117, హిస్టరీ- 77, హిస్టరీ (ఉర్దూ మీడియం) – 17, హిస్టరీ (మరీఠీ మీడియం) – 01, మ్యాథ్స్ – 154, మ్యాథ్స్ (ఉర్దూ మీడియం) – 09, ఫిజిక్స్ – 112, ఫిజిక్స్(ఉర్దూ మీడియం) – 18, సంస్కృతం – 10, తెలుగు – 60, ఉర్దూ – 28, జువాలజీ – 128, జువాలజీ (ఉర్దూ మీడియం) – 18
ఉమ్మడి రాష్ట్రంలో 2008లో జేఎల్ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. అనేక అవాంతరాల తరువాత 2012లో ఈ పోస్టులను భర్తీ చేశారు. ఆ తర్వాత మళ్లీ జేఎల్ పోస్టుల భర్తీ జరగలేదు. దీంతో ఈ సారి పెద్ద ఎత్తున అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది