Sunday, July 7, 2024
HomeతెలంగాణTSRTC: 'బస్ లో భరోసా' మహిళా భద్రతకు ముందడుగు

TSRTC: ‘బస్ లో భరోసా’ మహిళా భద్రతకు ముందడుగు

బస్సులో మహిళా ప్రయాణికుల భద్రత కోసం ..

“బస్ లో భరోసా”అనే పేరుతో ఆర్.టి.సి, పాఠశాల బస్ లలో సీసీ కెమెరాల ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళా భద్రతకు వినూత్న కార్యక్రమలు చేపడుతూ మహిళలకు భరోసాగా నిలిస్తున్న జిల్లా పోలీస్ యంత్రాంగం, జిల్లా కలెక్టరేట్ ఆవరణలో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్,జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్ లో భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి కేటీఆర్.
స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.వేడుకల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్టం సిద్దించాక తెలంగాణ ప్రభుత్వం మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అనే సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు.తెలంగాణా పోలీస్ శాఖ శాంతి భద్రతల నిర్వహణలో అద్భుతంగా పని చేస్తోందని, సిసిటివిల ద్వారా నేర నియంత్రలో దేశం మొత్తంలో నంబర్ వన్ గా తెలంగాణ పోలీస్ నిలుస్తోందని పేర్కొన్నారు.

- Advertisement -

మహిళా భద్రత కోసం షి టీములు ఏర్పాటు చేసి మహిళలకు భరోసా కల్పిస్తున్నామన్నారు. మహిళలు, ఉద్యోగం చేసేవారు, గృహిణిలు తమ తమ అవసరాలను,పనుల కోసం ఎక్కువగా బస్ లలో విద్యార్థినిలు పాఠశాల బస్ లలో అత్యవసర సమయాల్లో, రాత్రి పగటిపూట ప్రయాణాల్లో ప్రయాణించే వారి భద్రతకు భరోసా కల్పించేందుకు ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ముఖ్యంగా మహిళల రక్షణకై జిల్లా పోలీస్ శాఖ జిల్లాలోని ఆర్.టి.సి,పాఠశాల బస్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.మహిళలు సురక్షితంగా, పూర్తి రక్షణతో ప్రయాణించేందుకు బస్ లో భరోసా కార్యక్రమం ద్వారా సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం అభినందనియం అన్నారు. ఈ ఏర్పాటుకు కృషి చేసిన ఎస్పీ అఖిల్ మహాజన్ ను, జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు.జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 77 బస్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని, మిగిలిన బస్ లలో 10 నుండి 15 రోజులలో పూర్తి చేస్తామని అన్నారు. ఆర్.టి. సి బస్ లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు డిపో కార్యాలయానికి, జిల్లా పోలీస్ కార్యాలయానికి అనుసంధానం చేయడం జరిగిందన్నారు. పాఠశాల బస్ లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు జిల్లా పోలీస్ కార్యాలయానికి అనుసంధానం చేశామన్నారు. మంత్రి వెంట రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్,జెడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, టెక్స్ టైల్, పవర్ లూమ్ కార్పొరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్, టెస్క్యాబ్ చైర్మన్ కొండూరు రవీందర్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్,రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, గ్రంధాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు ఉదేయ్ రెడ్డి, నాగేంద్రచారి, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News