Thursday, September 19, 2024
HomeతెలంగాణTSRTC: పెళ్లి బస్సులపై 10% డిస్కౌంట్

TSRTC: పెళ్లి బస్సులపై 10% డిస్కౌంట్

పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. శుభకార్యాలకు అద్దె బస్సులపై ప్రత్యేక రాయితీని కల్పిస్తోంది. అన్ని రకాల బస్‌ సర్వీస్‌లపై 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌ 30 వరకు అద్దె బస్సులపై 10 శాతం రాయితీ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. కార్తీక మాసం, వనభోజనాలు, శబరిమల అయ్యప్ప దర్శనం సందర్భంగా అద్దె బస్సులకు రాయితీని గతంలో సంస్థ కల్పించింది. గత ఏడాది డిసెంబర్‌ 31తో ఆ రాయితీ గడువు ముగిసింది. తాజాగా పెళ్లిళ్ల సీజన్‌ రావడంతో డిమాండ్‌ దృష్ట్యా.. 10 శాతం రాయితీ కల్పించాలన్నసూచన మేరకు రాయితీని సంస్థ ప్రకటించింది.
ముందస్తుగా ఎలాంటి నగదు డిపాజిట్‌ లేకుండానే ఈ సదుపాయాన్ని కల్పిస్తుండటం విశేషం. అద్దె బస్సుల బుకింగ్‌ కోసం అధికారిక వెబ్‌సైట్ www.tsrtconline.in ను సందర్శించవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News