Saturday, November 23, 2024
HomeతెలంగాణUTF: ఉపాధ్యాయ కుటుంబాలకు భరోసా

UTF: ఉపాధ్యాయ కుటుంబాలకు భరోసా

టీఎస్ యుటిఎఫ్ కుటుంబ సంక్షేమ నిధి

ఉపాధ్యాయ కుటుంబాలకు టీఎస్ యుటిఎఫ్ చేపట్టిన కుటుంబ సంక్షేమ నిధి భరోసాయిస్తుందని ఆ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి, అంబటి భుమేశ్వర్ పేర్కొన్నారు. కుటుంబ సంక్షేమ నిధి సభ్యత్వంలో భాగంగా మల్లాపూర్ మండల కేంద్రంలోని వివిధ పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులను చేర్పించారు. ఉపాధ్యాయుల కుటుంబాల సంక్షేమానికి చేపట్టిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విరివిగా చేరి తమ కుటుంబాలకు భరోసా చేకూర్చాలని కోరారు.
ఉపాధ్యాయులు రెండువందల రూపాయల సభ్యత్వ రుసుము, వెయ్యి రూపాయల కార్పస్ ఫండ్ చెల్లించి సభ్యత్వం పొందాలని కోరారు. మరిన్ని వివరాలకు జిల్లా కమిటి, అయా మండల కమిటీలను సంప్రదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి మొలుగురి నరేశ్, కుటుంబ సంక్షేమ నిధి జిల్లా సభ్యులు కొండ్ర అనిల్ , జిల్లా సీనియర్ నాయకులు పబ్బ అనీల్, మండల కమిటీ అధ్యక్షా ప్రధాన కార్యదర్శులు నిరంజన్ గౌడ్, బబ్బురి రాజేందర్, తీట్ల లక్ష్మి నారాయణ, ఉపాద్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News