తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి బీఆర్ నాయుడు స్వామివారి ప్రసాదం అందజేశారు. అనంతరం బీఆర్ నాయుడును సీఎం సత్కరించారు. ఇరువురు తిరుమల ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు సమాచారం.
- Advertisement -
బుధవారం ఉదయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR)ను బీఆర్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నందినగర్‌లోని కేటీఆర్ నివాసానికి వెళ్లిన బీఆర్ నాయుడు దాదాపు 30 నిమిషాల పాటు ఆయనతో చర్చించారు. కాగా వరుసగా తెలంగాణ ముఖ్య నేతలను బీఆర్ నాయుడు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.